Begin typing your search above and press return to search.
ఈసారి ఖేల్ రత్నాల ఎంపిక సో స్పెషల్ .. ఎలానంటే?
By: Tupaki Desk | 19 Aug 2020 10:45 AM ISTదేశ అత్యున్నత క్రీడా పురస్కారంగా చెప్పే ఖేల్ రత్న అవార్డుల ఎంపికకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ప్రతి ఏడాది ఒకరో.. ఇద్దరో.. లేదంటే చాలా అరుదుగా ముగ్గురు మాత్రమే ఎంపిక చేసే ఖేల్ రత్నాల అవార్డుల్ని ఈసారి ఐదుగురికి కేటాయించటం ఆసక్తికరంగా మారింది. ఊహించని రీతిలో అత్యధిక మందికి ఖేల్ రత్న అవార్డుల్ని ప్రకటించటం క్రీడా ప్రపంచంలో పండుగ లాంటి వాతావరణం నెలకొంది.సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ముకుందకం శర్మ టీంలోని పన్నెండు మంత్రి సభ్యుల కమిటీ తాజాగా పురస్కార గ్రహాతల పేర్లను ప్రకటించారు.
క్రికెట్ లో సుపరిచితుడైన రోహిత్ శర్మ.. రెజ్లింగ్ లో తన సత్తా చాటిన వినేశ్ ఫోగాల్.. హాకికి రాణి రాంపాల్.. టీటీకి సంబంధించి మౌనిక బాత్రా.. పారాలింపిక్స్ ఆటగాడు మరియప్పన్ తంగవేలును ఎంపిక చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.మిగిలిన అవార్డులకు సైతం ఎక్కువమంది పేర్లను ప్రకటించటం గమనార్హం. ఈ పురస్కారానికి అర్హత సాధిస్తారని భావించిన స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తో పాటు.. ప్రపంచ అండర్ 20 ఛాంపియన్ నీరజ్ చోప్రా.. పరుగులో అండర్ 30లో ఛాంపియన్ అయిన హిమదాస్కు నిరాశ తప్పలేదు.
ఇదిలా ఉంటే అర్జున్ అవార్డు ఎంపిక కోసం 29 మందితోకూడా క్రీడాకారుల జాబితానుసిద్ధం చేశారు. వీరు పెద్ద ఎత్తున పురస్కారాలకు సిఫార్సు చేశారు. ద్రోణాచార్య పురస్కారానికి 13మందిని. ధ్యాన్ చంద్ అవార్డుకు 15 మందికి ఇవ్వాలని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి అవార్డుల్ని వర్చువల్ గా నిర్వహించనున్నారు. ఖేల్ రత్న పురస్కారంలో భాగంగా పతకం.. సర్టిఫికేట్ తో పాటు రూ.7.5 లక్షల మొత్తాన్ని అందిస్తారు. ఇక.. అర్జున్ అవార్డును సొంతం చేసుకున్న వారికి సర్టిఫికేట్.. షీల్డ్ తో పాటు.. రూ.5లక్షల్ని అందిస్తారు.