Begin typing your search above and press return to search.

ఖ‌త‌ర్నాక్ ర‌విప్ర‌కాష్.. టీవీ 9 మాజీ సీఈవో ఖిలాడీ గురూ..!

By:  Tupaki Desk   |   4 Nov 2019 11:08 AM GMT
ఖ‌త‌ర్నాక్ ర‌విప్ర‌కాష్..  టీవీ 9 మాజీ సీఈవో ఖిలాడీ గురూ..!
X
ఇప్ప‌టికే పీక‌ల్లోతు ఆర్థిక నేరాల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్న టీవీ 9 మాజీ సీఈవో వీ ర‌విప్ర‌కాష్‌.. మ‌రో పెద్ద కుంభ‌కోణంలో చిక్కుకుపోయారు. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉన్న ప్ర‌ముఖ ప్రాంతం కూచిపూడిలో ``సంజీవ‌ని హాస్పిట‌ల్స్‌`` పేరుతో ఓ ఆసుప‌త్రిని నిర్మించేందుకు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రించారు. అయితే, ఈ నిధుల‌ను ర‌విప్ర‌కాష్ స‌హా ఆయ‌న అనుచ‌రులు కొంద‌రు దారిమ‌ళ్లించార‌నే అభియోగాలు వ‌చ్చాయి. దీంతో కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తాజాగా దీనిపై దృష్టి పెట్టింది. ఈ కుంభ‌కోణం లోతుపాతుల‌ను బ‌హిర్గ‌తం చేసేందుకు సిద్ధ‌మైంది.

ఇదిలావుంటే, టీవీ 9 మాజీ సీఈవో ర‌వి ప్ర‌కాష్‌కు సంబంధించి అనేక లీల‌లు వెలుగు చూస్తున్నాయి. పేద పిల్ల‌ల అనారోగ్యాన్ని కూడా ఈయ‌న క్యాష్ చేసుకున్నాడ‌ని తాజాగా ఓ సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. పేద పిల్ల‌ల్లో గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డేవారి `టీవీ 9 లిటిల్ హార్ట్స్‌` పేరుతో ప‌దేళ్ల కింద‌ట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పేద పిల్ల‌ల‌ పేర్ల‌ను టీవీలో ప్ర‌సారం చేసి, వారికి ఆర్థిక సాయం చేయాల‌ని దీనాతి దీన‌మైన స్వ‌రంతో ప్రేక్ష‌కుల‌ను ముగ్గులోకి దింపి, వారు జాలి ప‌డి పేద పిల్ల‌ల కోసం ఇచ్చిన సొమ్మును కూడా ర‌వి ప్ర‌కాష్ స్వాహా చేశాడు. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు సంజీవ‌ని హాస్పిట‌ల్స్ పేరుతో మ‌రో తాజా కుంభ‌కోణానికి ఒడిగ‌ట్టిన‌ట్టు అధికారులు గుర్తించారు.

కూచిపూడిలోని ప్ర‌జ‌ల‌ను ర‌విప్ర‌కాష్‌, ఆయ‌న వ్యాపార భాగ‌స్వామి కూచిభొట్ల ఆనంద్ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌జ‌ల‌నుంచి దండుకున్న విష‌యంపై ఇప్ప‌టికే ప‌లువురు ఫిర్యాదులు చేసిన‌ట్టు తెలిసింది. భారీ ఎత్తున విరాళాలు సేక‌రించే స‌మ‌యంలో ప్ర‌జ‌ల వ‌ద్దకే వైద్య స‌దుపాయాలు అందిస్తామ‌ని ఇద్ద‌రూ హామీ ఇచ్చిన‌ట్టు పేర్కొన్నారు. జీవిత కాల ఉచిత వైద్యం ఇస్తామ‌ని కూడా హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌జ‌లు త‌మ ఫిర్యాదుల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా రూ.ల‌క్ష అంత‌క‌న్నా ఎక్కువ డోనేష‌న్ ఇచ్చిన వారికి అమెరికా వైద్యుల‌తో చికిత్స‌ను ఉచితంగా అందిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు.

కాగా, ప్ర‌జ‌ల ఫిర్యాదుల‌తో రంగంలోకి దిగిన అధికారుల‌కు దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు క‌నిపించాయి. ర‌విప్ర‌కాష్‌, ఆనంద్ ఇద్ద‌రూ కూడా ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళాలుగా సేక‌రించారని, ఈ విరాళాల‌కు గాను ఆదాయ‌పన్ను మిన‌హాయింపు ఉంటుంద‌ని చెప్పార‌ని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కాగా, ఇటీవ‌ల కూచిపూడికి చెందిన ఓ దాత‌కు గుండె పోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న నేరుగా ర‌విప్ర‌కాష్ నేతృత్వంలోని సంజీవ‌ని ఆసుప‌త్రికి చేరుకుని వైద్యం కోసం అభ్య‌ర్థించారు. అయితే, స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ అందుబాటులోకి లేక పోవ‌డంతో దాత మృతి చెందారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఈ కేసును విచారిస్తున్న అధికారుల‌కు వెల్లడించారు. దాత ఇచ్చిన విరాళానికి సంబంధించిన డాక్యుమెంట్ల‌ను కూడా అధికారులకు అందించారు.

ఇప్ప‌టికీ కూడా ఈ ఆసుప‌త్రిలో స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ విష‌యం తెలిసిన మిగిలిన దాత‌లు కూడా తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. త‌మ‌ను ర‌విప్ర‌కాష్‌, ఆయ‌న మిత్రులు బుట్ట‌లో వేసుకున్నార‌ని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ విష‌యంపై దృష్టి పెట్టిన అధికారుల‌కు మ‌రిన్ని విష‌యాలు తెలిసాయి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చిన దాత‌ల పేర్ల‌ను ఆసుప‌త్రిలోని ప‌లు వార్డుల‌కు పెడ‌తామ‌ని ర‌వి ప్ర‌కాశ్ హామీ ఇచ్చారు. దీంతో ఆయ‌న మాట‌ల‌ను విశ్వ‌సించిన దాత‌లు భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. తీరా ఇప్పుడు ఏ ఒక్క వార్డుకు కూడా దాత‌ల పేర్లు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, ఈ కేసును ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. అధికారులు నివేదిక ఇచ్చాక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చూస్తోంది. దీంతో ర‌వి ప్ర‌కాష్ ఆయ‌న అనుచ‌రుల చుట్టూ మ‌రింత‌గా ఉచ్చు బిగుసుకోనుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.