Begin typing your search above and press return to search.
కామాంధుడికి బలి.. 28 రోజులు పోరాడి ఓడిన ఖమ్మం బాలిక
By: Tupaki Desk | 16 Oct 2020 11:15 AM ISTపన్నెండేళ్లు. ఆడుతూపాడుతూ స్కూలుకు వెళ్లాల్సిన చిట్టితల్లి. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు ఒకరింట్లో పనులు చేసేందుకు ఒప్పుకోవాల్సిన కుటుంబ నేపథ్యం.. ఆమె మీద కన్నేసిన ఆ ఇంటి కొడుకు కండకావరానికి ఖమ్మం బాలిక బలైంది. అన్నాఅంటున్నా కనికరించకుండా బలాత్కారం చేయబోయి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన వైనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయం బయటకు రాకుండా చేసేందుకు నిందితుని కటుుంబం ప్రయత్నించింది. 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరి.. నరకయాతన అనుభవించిన బాలిక ఎట్టకేలకు కన్నుమూసింది.
28రోజుల పాటు చావుతో పోరాడిన బాలిక గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసింది. తాజాగా ఆమె డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఖమ్మం రూరల్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం.. పన్నెండేళ్ల బాలికను ఖమ్మంలోని ఒకరింట్లో పనికి కుదిర్చారు. అయితే.. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందంటూ ఇంటి యజమాని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పి.. ఆసుపత్రిలోచేర్పించారు. సెప్టెంబరు 18న చోటు చేసుకున్న ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడిన బాలిక.. అక్టోబరు 5న కోలుకుంది. అనంతరం.. తనకు జరిగిన అన్యాయం గురించి బయటపెట్టటంతో అసలు విషయం వెల్లడైంది.
ఇంటి యజమాని కొడుకు తనపై అత్యాచార యత్నం చేయబోయాడని.. తాను ప్రతిఘటించటంతో తన మీద పెట్రోల్ పోసి తగలెట్టిన దారుణాన్ని బయటపెట్టటంతో అంతా షాక్ తిన్నారు. కాలిన గాయాలతో చేరిన బాలికకు సంబంధించిన సమాచారాన్ని బయటకు వెల్లడించని సదరు ఆసుపత్రిని సీజ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆమెను హైదరాబాద్ కు తరలించి.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. తాజాగా ఆ బాలిక 28 రోజులపాటు చావుతో పోరాడి ఓడిపోయింది. శాశ్వితంగా తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లింది. పన్నెండేళ్ల చిరుప్రాయంలో నరకయాతన అనుభవించిన బాలిక కష్టం తలుచుకుంటేనే ఒళ్లు జలదరించటమే కాదు.. కంట కన్నీరు కారటం ఖాయం.