Begin typing your search above and press return to search.
ఖమ్మం సభ.. బీఆర్ ఎస్‌కు ఊపు తెచ్చేనా?
By: Tupaki Desk | 15 Jan 2023 4:00 PM ISTటీఆర్ ఎస్ పార్టీని బీఆర్ ఎస్‌గా మార్చినప్పటికీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న విధంగా అయితే.. ఊపు కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో పార్టీ దూకుడు పెరుగుతుందని అనుకున్నా.. బిహార్ సీఎం నితీష్ కుమార్.. స్వయంగా తాను కూడా రంగంలోకి దిగుతున్నట్టు ప్రకటించడంతో కేసీఆర్ దూకుడు కొంత నెమ్మదించిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఏపీలో అడుగులు వేసినా.. కాపు నేతలను పార్టీలో చేర్చుకుంటున్న తీరు వికటించింది.
పవన్ కళ్యాణ్ పార్టీకి.. కేసీఆర్ ఎసరు పెడుతున్నారనే వాదన బలంగా వినిపించింది. దీంతో కేసీఆర్ ఆశించిన విధంగా పార్టీ అయితే.. ముందుకు సాగలేక పోతోంది. ఇలాంటి సమయంలో ఖమ్మం వేదికగా.. ఈ నెల 18(బుధవారం) నిర్వహించనున్న బీఆర్ ఎస్ తొలి బహిరంగ సభపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆసక్తిగా మారింది. ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు శక్తియుక్తుల మేరకు కష్టపడుతున్నారు.
2001లో టీఆర్ ఎస్ ఆవిర్భావం తర్వాత.. కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన సభ ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినట్టే.. ఖమ్మం సభ బీఆర్ఎస్కు జాతీయ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చేలా మారుతుందని బీఆర్ ఎస్ కీలక నేతలు భావిస్తున్నారు. ఈ సభ మొత్తాన్ని విజయవంతం చేసేలా.. మంత్రి హరీశ్‌రావుకి సభా నిర్వహణ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే.
పోరాటా పోరు గడ్డగా పేరున్న ఖమ్మంలో సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా, ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభ లక్ష్యాలు.. భారీ జనసమీకరణ, సభకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తున్నారు.
అయితే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు అదే రోజు బీజేపీలో చేరుతుండడం.. మరో ఆసక్తిక ర పరిణామంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 3 లక్షల మందిని తరలించేలా లక్ష్యం పెట్టుకున్నా.. అంత మంది వస్తారన్న ఆశలు కనిపించడం లేదు. మరోవైపు.. ప్రాథమికంగానే 5 లక్షలమందిని తీసుకురావలని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ ఎస్ సభ ఎలా సక్సెస్ అవుతుంది? ఏం చేస్తారు? ఇది జాతీయ స్థాయిలో ఎలా దూసుకుపోతుందనే అంశాలు చాలా ఆసక్తిగా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.