Begin typing your search above and press return to search.

పుడుతూనే రికార్డుగా మారిన తెలంగాణ పాప

By:  Tupaki Desk   |   11 May 2020 12:30 PM IST
పుడుతూనే రికార్డుగా మారిన తెలంగాణ పాప
X
కొంతమంది పుడుతూనే అందరిని ఆకర్షిస్తుంటారు.తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పుట్టిన శిశువు ఇప్పుడు రికార్డుగా మారింది. సాధారణంగా పుట్టిన వేళలో శిశువులు ఒకటిన్నర కేజీ నుంచి మూడున్నర కేజీల మధ్యలో ఉంటారు. ఇందుకు భిన్నంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన శిశువు బరువు ఇప్పుడు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్యం అనే గర్భిణి డెలివరీ కోసం సర్కారు దవాఖాను వచ్చారు. వైద్య పరీక్షలుచేసిన వైద్యులు.. .ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఊహించని రీతిలో పుట్టిన పాప బరువు ఐదు కేజీల వంద గ్రాములు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇంత బరువున్న శిశువు చాలా అరుదుగా పుడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. పాప.. తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ పాప బరువు గురించి తెలిసిన వారంతా తెలంగాణలో భీముడి చెల్లెలు పుట్టిందన్న మాట పలువురి నోట రావటం గమనార్హం. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇంత బరువున్న శిశువులు జన్మిస్తారని చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత బరువుతో పుట్టిన శిశువుల రికార్డు చూస్తే.. టాప్ ఫైవ్ లో ఐదో స్థానంలో ఉన్న శిశువు ఏడున్నర కేజీలు ఉన్నట్లుగా తేలింది. 2007లో దక్షిణాఫ్రికా లో పుట్టిన ఈ పాపగా తేలింది. ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత బరువుతో పుట్టిన శిశువు రికార్డు 1879లో నమోదైంది. ఆ శిశువు ఏకంగా పది కేజీల బరువుగా నమోదైంది. ఈ శిశువు కెనడాలో జన్మించింది.