Begin typing your search above and press return to search.
మోదీ చేతిలో కీలక అస్త్రం.. అందుకే అంతా గప్ చుప్?
By: Tupaki Desk | 12 Nov 2021 8:00 AM ISTకేంద్రంలో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఏ పార్టీ మద్దతు లేకుండా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో బీజేపీకి కేంద్రంలో అడ్డు అనేది లేకుండా పోయింది. ఈ కారణంగానే మోదీ సర్కారు దూకుడుగా సంస్కరణకు చర్యలు చేపడుతోంది. ఈక్రమంలోనే పార్లమెంటులో కేంద్రంలో రైతుల కోసం మూడుచట్టాలను తీసుకొచ్చింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకతలు వచ్చాయి.
అయితే బీజేపీకి కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ఆ ప్రభావం మోదీ సర్కారుపై పెద్దగా కన్పించడం లేదు. ఇదే సమయంలో మోదీ కొన్ని వర్గాలకు ఇబ్బందులు కలిగే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని పలువురు కేంద్ర మంత్రులు మోదీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన బేఖాతారు చేశారనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో మోదీపై సొంత నేతల్లోనే వ్యతిరేకత మొదలైందనే టాక్ ఉంది.
ఇదే సమయంలో ప్రధాని మోదీ వద్ద పలువురు నేతలకు రహస్య ఫైల్స్ ఉన్నాయనే చర్చ తాజాగా నడుస్తోంది. అయితే ఈ ఫైల్స్ ఇప్పటివరకు కావని తెలుస్తోంది. పీవీ నర్సింహరావు ప్రధాని ఉన్న సమయంలో ఓ డజను మంది నేతలకు సంబంధించిన చిట్టాను తన వద్ద రహస్య ఫైల్స్ రూపంలో కార్యాలయంలో ఉంచారని సమాచారం.
ఆ సమయంలో ప్రధాని కార్యాలయంలో పని చేసిన మాజీ అధికారి మీనాక్షి సుందరం త్వరలోనే ఈ వివరాలను ఓ పుస్తకంలో వెల్లడించున్నారని తెలుస్తోంది. ‘Furrows in a field’ అనే పేరుతో ఆమె పుస్తకాన్ని రచించారు. దీనిని మాజీ ప్రధాని దేవెగౌడ విడుదల చేయనున్నారు. ఈ పుస్తకంలో ఆమె పలు సంచలన విషయాలను వెల్లడించారని సమాచారం. ఈ పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది.
పీవీ నర్సింహారావు హయాంలో క్యాబినేట్లో మంత్రులుగా పని చేసిన 12మంది వివరాలతోపాటు బయటి వ్యక్తులకు సంబంధించిన వివరాలను ఆయన తన దగ్గర ఉంచుకునే వారట. ఇవన్నీ కూడా ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రుల వద్ద కూడా ఉన్నాయి. ఈ లిస్టులో ములాయం సింగ్, జయలలిత, బంగారప్ప, శరద్ పవర్ లాంటి వాళ్లకు సంబంధించిన రహస్య ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
దేవగౌడ్ ప్రభుత్వం పడిపోయాక వాజ్ పేయి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఈ ఫైల్స్ అన్ని కూడా తనవద్దే ఉంచుకున్నట్లు మీనాక్షి సుందరం చెప్పారు. అయితే ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన అశోక్ సైకియాకు అందజేసినట్లు మీనాక్షి చెప్పారు.
ఇక 2007లో అశోక్ సైకియా చనిపోగా ఆ ఫైల్స్ సంగతి ప్రశ్నార్థకంగా మారింది. ఇక 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్ర మిశ్రా పని చేస్తున్నారు. అయితే ఈ రహస్య ఫైల్స్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన అంటున్నారు.
కాగా మరోవైపు అనధికారిక సమాచారం ప్రకారం ఆ ఫైల్స్‌తో పాటు మరింత సమాచారం మోదీ వద్ద ఉందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఒకవేళ ఈ ఫైల్స్ బయటికొస్తే మాత్రం రాజకీయ సునామీ తప్పదనే ప్రచారం జరుగుతోంది. దీంతోనే మోదీపై పెద్దఎత్తున బీజేపీలో, ఇతర ముఖ్యనేతల్లో వ్యతిరేకత ఉన్నా వారంతా గప్ చుప్ గా ఉన్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.