Begin typing your search above and press return to search.

యువతిపై 139 మంది రేప్‌ కేసు లో కీలక ముందడుగు !

By:  Tupaki Desk   |   28 Aug 2020 12:20 PM IST
యువతిపై 139 మంది రేప్‌ కేసు లో కీలక ముందడుగు !
X
తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేయడం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తన ఫిర్యాదు లో తనపై అఘాయిత్యానికి పాల్పడినవాళ్ల అందరి పేర్లను అందులో పొందుపరిచింది. ఈ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో 113 పేజీలతో ఎఫ్ ఐ ఆర్‌ నమోదు చేశారు పంజాగుట్టు పోలీసులు. పదేళ్లుగా తనను వేధిస్తున్నారని.. తనపై 139 మంది అత్యాచారం చేశారని తనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. కాగా, ఇప్పటికే ఈ కేసు సీసీఎస్ ‌కు బదిలీకాగా , ఇప్పుడు ప్రత్యేక విచారణ అధికారిగా ఏసీపీ శ్రీదేవిని నియమించారు.

ఇక నుండి ఈ కేసుని ఏసీపీ శ్రీదేవి ద‌ర్యాప్తు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట‌య్యాయి. అధికారులు యువతి ఇచ్చిన స్టేట్‌ మెంట్ ‌ని పరిశీలిస్తున్నారు. స్టేట్‌ మెంట్‌తో పాటు ఇచ్చిన ఆధారాలకు ఆనుగుణంగా కేసులో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. ఇక, పూర్తి ఆధారాలు సేకరించి, ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసేందుకు సీసీఎస్ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం సిద్ధమౌతోంది.