Begin typing your search above and press return to search.
ఎన్నాళ్లకు తెగించావ్ చంద్రబాబు.. నానికి కీలక బాధ్యతలు
By: Tupaki Desk | 23 Dec 2021 12:07 PM ISTఅంతంటాడు.. ఇంతంటాడు.. అన్నట్లు ఉంటుంది తెలుగుదేశం పార్టీ పెద్దాయన చంద్రబాబు తీరు చూస్తే. తనకు మించిన సీనియర్ లేరని చెప్పే ఆయన.. ఇంత వయసు.. ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తెగ ఆలోచిస్తారు. ఎంతకూ ఒక నిర్ణయానికి రారు. అదే పనిగా నానపెట్టి ఉంచుతారే కానీ తేల్చేయరు.
దీంతో.. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఏదైనా సరే.. పెండింగ్ లో ఉండటం మినహా మరేం ఉండదు. అధికారంలో పార్టీని పట్టించుకోవటానికి టైం దొరకని బాబు.. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకున్నా.. తెగింపు నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఆయనలో కనిపించదు. దీంతో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది తప్పించి మార్పు రాదు.
తెలుగు రాష్ట్రాల్లో మరే పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ బలాన్నితగిన రీతిలో ఉపయోగించుకోవటంలో చంద్రబాబు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎన్ని అనుభవాలు ఎదురైనా.. మరెన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. పార్టీలో జెండా మోసినోడికి న్యాయం జరుగుతుందన్న విషయంలో మాత్రం బాబు భరోసా ఇవ్వలేకపోతారు. ఎవరిని నొప్పించకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని పట్టుకొని.. అందరినినొప్పించే సిత్రమైన గుణం చంద్రబాబు సొంతంగా చెప్పాలి.
అలాంటి ఆయన ఎట్టకేలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ చార్జి పదవి విషయంలో స్పష్టత ఇచ్చారు. గడిచిన కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఇష్యూను.. ఎట్టకేలకు క్లియర్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గబాధ్యతల్ని అప్పగిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. ఈ పదవి కోసం కేశినేనితో పాటు పోటీ పడ్డ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న.. నాగుల్ మీరాకు నిరాశ తప్పలేదు.
కాకుంటే.. ఇన్నాళ్లు నాన్చి.. నాన్చి నేతలకుచిరాకు తెప్పిస్తున్న చంద్రబాబు.. ఎట్టకేలకు ఎవరో ఒకరికి ఇన్ చార్జి బాధ్యతల్ని అప్పగించిన వైనంపై మాత్రం కిందిస్థాయి కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. కేశినేనికి కొత్త బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు.. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు? అన్నది ప్రశ్నగా మారింది.
దీనికి పార్టీ వర్గాలు చెబుతున్నదేమంటే.. ఇప్పటికే నాగుల్ మీరా.. బుద్దా వెంకన్నకు వేర్వేరు బాధ్యతలు ఉన్నందున.. కేశినేనికి కొత్త బాధ్యతల్ని అప్పగించారని చెబుతున్నారు. అయితే.. ఎంపీ కేశినేనికి బుద్ధా వెంకన్న.. నాగుల్ మీరాకు మధ్య వర్గ విభదాలు ఉన్న సంగతి తెలిసిందే. మరి.. వీటిని ఎలా లెక్క తేలుస్తారన్నది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.