Begin typing your search above and press return to search.

భారత సంతతి న్యాయవాదికి కీలక బాధ్యతలు

By:  Tupaki Desk   |   8 Jan 2021 9:12 PM IST
భారత సంతతి న్యాయవాదికి కీలక బాధ్యతలు
X
అమెరికాలో భారతీయులకు అందలం దక్కుతోంది. అగ్రరాజ్యంలో వరుసగా మనవారికి అగ్రతాంబూలం దక్కుతోంది. ఇప్పటికే భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్ ఏకంగా అమెరికాకు ఉపాధ్యక్షురాలు అయ్యింది. ఇక అమెరికాలోనూ పలువురు గొప్ప గొప్ప ఘనత సాధిస్తున్నారు

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పుట్టిన భారత సంతతి లాయర్ వనితా గుప్తాను.. ఆదేశ అసోసియేట్ అటార్నీ జనరల్ గా జోబైడెన్ నియమించారు.

ఈ నియామకాన్ని సెనెట్ ఆమోదిస్తే ఈ పదవిని చేపట్టిన మొదటి భారత సంతతి మహిళగా ఆమె నిలుస్తారు.ఈ సందర్భంగా వనిత గర్వించదగ్గ భారత సంతతి కుమార్తె అని బైడెన్ పేర్కొన్నారు.

ప్రతి కేసులోనూ సమానత్వం కోసం పోరాడిన వనిత ప్రజల్ని ఐక్యమత్యం చేయడంలో సఫలమయ్యాడని ప్రశంసించారు.