Begin typing your search above and press return to search.
యూపీకి రాహుల్ - ప్రియాంక.. బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు
By: Tupaki Desk | 1 Oct 2020 6:30 PM ISTఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో అత్యాచారానికి గురైన బాలక వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మహిళా లోకం భగ్గుమంది. యూపీ అట్టుడుకింది. పార్టీలు, ప్రతిపక్షాలు బాధితులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.. దీంతో బాధితురాలి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం కూడా వివాదాస్పదైంది..
యూపీలో ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన రేకెత్తింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి 2.45 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులను సైతం అనుమతించలేదు. అంతేకాదు వారు రాకుండా ఇళ్లకు తాళం కూడా వేసి పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా యూపీలో రాహుల్ గాంధీ, ప్రియాంక సైతం పర్యటించడానికి వెళ్లగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. యూపీ అంతటా ఇప్పుడు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
కాగా హత్యాచార బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితురాలిని దారుణంగా హింసించి చంపారని.. యువతి మెడ ఎముక విరిగినట్లు వైద్యులు తేల్చారు.