Begin typing your search above and press return to search.

లవ్ జిహాద్: బీజేపీకి గట్టి షాక్ తగిలిందే?

By:  Tupaki Desk   |   8 Nov 2020 5:00 AM IST
లవ్ జిహాద్: బీజేపీకి గట్టి షాక్ తగిలిందే?
X
లవ్ జిహాద్. ఇప్పుడు ఉత్తరభారతంలో మొదలైన ఈ తంతు యావత్ దేశమంతా పోకింది. దీనిపై బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కఠిన చర్యలకు దిగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సైతం లవ్ జిహాద్ పై కఠినంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది.

ఈ క్రమంలోనే దేశంలోని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు లవ్ జిహాద్ పై కారాలు మిరియాలు నూరారు. ఓ వర్గం యువతులను ఇంకో మతంలోకి మార్చాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు.

ఇక యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అయితే ఒక అడుగు ముందుకేసి దీనిపై తీవ్రంగా స్పందించాడు. ‘లవ్ జిహాద్’ పేరుతో ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏకంగా కొత్త చట్టం తీసుకువస్తానన్నారు. ఇతర మతస్థుల యువకులు లవ్ జిహాద్ చేస్తే వారికి అంతిమ సంస్కారాలు తప్పవని బాహాటంగా ప్రకటించడం దుమారం రేపింది.

యూపీ అనడమే కాదు.. తాజాగా ఈ కేసులను విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి కేసులు కాన్పూర్ లో 14 నమోదయ్యాయి. వాటిలో 7 కేసుల్లో విచారణ చేపట్టి పోలీసులకు షాక్ తగిలింది. హిందూ యువతులే తమ ఇష్టప్రకారం వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్నామని.. ఇష్టప్రకారమే మతం మారినట్టు కోర్టులో తెలిపారు.

పోలీసుల విచారణలో లవ్ జిహాద్ కోణం లేకపోవడంతో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. గన్ తలకు పెట్టి బెదిరించి తన కూతురును పెళ్లి చేసుకున్నాడని ఓ తండ్రి లవ్ జిహాద్ కేసు పెట్టగా.. యువతి మాత్రం తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నామని తెలుపడం గమనార్హం. ఇప్పుడీ ఈ కేసులో యూపీలో హాట్ టాపిక్ గా మారాయి.