Begin typing your search above and press return to search.
వాజే కేసులో కీలక ఆధారాలు స్వాధీనం
By: Tupaki Desk | 29 March 2021 11:28 AM ISTదేశంలోనే సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ ఇంటి ఎదుట కారు ఉంచిన కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. కేసు విచారణను వేగవంతం చేసిన ఎన్ఐఏ పలు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది.
ఈ కేసులో అనుమానాస్పద స్థితిలో మరణించిన మన్ సుక్ మృతి కేసు విచారణలోనూ ఈ ఆధారాలు అవసరం అవుతాయని ఎన్ఐఏ అంటోంది.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్థాలు ఉంచిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. విచారణలో భాగంగా పలు కీలక ఆధారాలను సేకరించారు.
వాజేతో కలిసి ముంబై బాంద్రాలోని మిథి రివర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇచ్చిన ఆధారాలతో గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. నదిలో గంటపాటు వెతికారు. ఇందులో రెండు కంప్యూటర్ సీపీయూలు, హార్డ్ డిస్క్ లు, ఒక ల్యాప్ టాప్, ఒక రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న రెండు నంబర్ ప్లేట్లు కొన్ని వస్తువులను వెలికితీశారు.
ఏప్రిల్ 3 వరకు వాజే ఎన్ఐఏ కస్టడీలోనే ఉండనున్నాడు. కేసులో కీలకమైన ఎస్.యూ.వీ యజమాని మన్ సుక్ హిరాన్ మృతి నేపథ్యంలో వాజేకు ఉచ్చు బిగుసుకుంటోంది.