Begin typing your search above and press return to search.
రథయాత్రల రాజకీయంపై.. బీజేపీలో కీలక చర్చ.. వర్కువుట్ అయ్యేనా?
By: Tupaki Desk | 20 Jan 2021 8:00 AM IST`రథయాత్రల రాజకీయాలు అనుకున్నంత సులువు కాదు! దీనివల్ల మనం చాలా కోల్పోతాం. ఒక్కసారి ఆలోచించి అడుగులు వేయండి!``- ఇదీ.. బీజేపీలో సీనియర్ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి.. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న మేధావి.. మాట ఇది. తరచుగా విజయవాడకు వచ్చే ఈయన ప్రత్యక్షంగా రాజకీయాల విషయాలను మాట్లాడక పోయినా.. పరోక్షంగా మాత్రం రాజకీయాలను స్పృశిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో ని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థం వరకు రథయాత్ర నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.
మతపరంగా విడదీయలేం!
దీనిపై నాయకులు సమాలోచనలు చేసిన అనంతరం.. రథయాత్రకు ఎక్కువ మంది మొగ్గు చూపారు. అయితే.. ఈ విషయంపై సదరు సీనియర్ మేధావికి సమాచారం అందింది. దీంతో ఆయన ఇలాంటివాటికి దూరంగా ఉంటేనే మంచిదని సూచించినట్టు తెలిసింది. దీనికి ప్రధానంగా ఆయన రెండు కారణాలు పేర్కొంటున్నారని అంటున్నారు. గతానికి ఇప్పటికీ ప్రజల జీవన శైలితో పాటు.. అభిప్రాయాలు కూడా మారాయని.. ఒకప్పుడు ఉన్న పట్టింపులు.. ఇప్పుడు లేవని.. సో.. ఇప్పుడు మతపరంగా ప్రజలను విడదీయడం వల్ల గ్రామస్థాయిలో ప్రజలు పార్టీకి చేరువ అయ్యే పరిస్థితి లేదని ఆయన బోధించారని సీనియర్లు చర్చించుకుంటున్నారు.
వీర్రాజు దూకుడు వద్దు..
పైగా.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియానిటీ పెరుగుతోందని అంటున్నప్పుడు.. వారిని హిందూమతంలోకి ఘర్ వాపసీ కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఇది లేకుండా రథయాత్రలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని కూడా ప్రశ్నించినట్టు సమాచారం. సదరు మేధావికి అత్యంత సన్నిహితంగా ఉండే.. మాజీ ఎంపీలు, రాష్ట్ర మాజీ మంత్రులు కొందరు ఇప్పటికే ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు దూకుడుగా వెళ్తున్నారని.. ఇది పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా కనిపించడం లేదని.. యాత్రలు చేయడానికి ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్ అని.. ఉన్న సింపతీ కూడాపోతే.. కష్టమని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఇలా వెళ్దాం..
నేతల మధ్య మరో ఆసక్తికర విషయం చర్చకు వచ్చింది. రథయాత్రలు వద్దు అంటే.. పార్టీ బలపడేది ఎలా? అని సందేహం వచ్చింది. దీనికి వారు చెబుతున్న సమాధానం.. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి నరేంద్ర మోడీ ఇచ్చిన నిధులే కీలకం కాబట్టి.. ఆయా పనులపై విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా.. ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ఉందని.. గతంలో మాదిరిగా కాదని.. ప్రజలు ఏ పనిచేస్తున్నా.. దానిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు మిళితమై ఉంటున్నాయని.. సో.. సదరు లబ్ధిని వారికి వివరించడం ద్వారా పార్టీ ప్రజల కోసం పనిచేస్తోందనే భావన కల్పించడం ద్వారా ఎదగాలని నిర్ణయించారు. మరి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.