Begin typing your search above and press return to search.

కీలక నిర్ణయం.. ఏపీలో కేసులు ఎత్తివేశారు

By:  Tupaki Desk   |   18 Dec 2019 7:20 AM GMT
కీలక నిర్ణయం.. ఏపీలో కేసులు ఎత్తివేశారు
X
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పలు ఉదంతాలకు సంబంధించి నమోదైన కేసుల్ని ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాటి హెలికాఫ్టర్ ప్రమాదంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించటం తెలిసిందే. ఈ సందర్భంగా రిలయన్స్ షాపులపై దాడులకు కొందరు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వారిపై కేసులు నమోదయ్యాయి.

అంతేకాదు..కాపు ఉద్యమంలోభాగంగా తునిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి నమోదైన కేసుల్లోనూ నిందితులపై పెట్టిన కేసుల్ని ఎత్తి వేస్తున్నట్లుగా ఏపీ సర్కారు తాజాగా పేర్కొంది. అంతేకాదు.. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం భూసేకరణ సందర్భంగా అడ్డుకున్న వారిపైనా పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు.

ఈ ఉదంతానికి సంబంధించిన కేసుల్ని ఎత్తి వేస్తున్నట్లుగా తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని హోంశాఖ ముఖ్యకార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ వెల్లడించారు. ఇన్ని ఉదంతాలకు సంబంధించి కేసులు ఎత్తివేసిన వైనంపై ఏపీ ప్రతిపక్ష నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.