Begin typing your search above and press return to search.

బెంజ్ కారు నుంచి కీలక ఆధారాలు.. ఇన్నోవా మాటేంటి?

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:55 AM GMT
బెంజ్ కారు నుంచి కీలక ఆధారాలు.. ఇన్నోవా మాటేంటి?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పబ్ లో పరిచయమైన బాలికకు మాయమాటలు చెప్పి.. పేస్ట్రీ కొనిస్తానని చెప్పి బేకరీకి తీసుకెళ్లి.. గ్యాంగ్ రేప్ చేయటం తెలిసిందే.

ఈ దుర్మార్గంలో ఎమ్మెల్యే కుమారుడు మొదలుకొని పలువురు ప్రముఖులు ఉన్నారన్న విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. మొత్తం పది మంది కలిసి రెండు కార్లలో వెళ్లగా.. గ్యాంగ్ రేప్ జరిగిందంటూ ఇన్నోవా ఉదంతాన్ని మాత్రమే బయటకు రావటం తెలిసిందే.

గ్యాంగ్ రేప్ నకు కారణమైన ఇన్నోవా బయటకు రాకుండా.. బెంజ్ కారును తొలుత స్వాధీనం చేసుకోవటం లాంటి విచిత్రమైన ఉదంతాలు ఈ కేసులో కనిపిస్తాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలు వెలుగు చూసినట్లు చెబుతున్నారు.

సంచలనంగా మారిన ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు క్లూస్ టీం తమ పనిని మరింత వేగవంతం చేసినట్లు చెబుతున్నారు. బెంజ్ కారులో బాలికకు సంబంధించిన వస్తువుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

బాలికకు చెందిన వెంట్రుకులను సేకరించారని.. ఇయర్ రింగు కూడా దొరికినట్లు చెబుతున్నారు. బెంజ్ కారులో ఇవి దొరికితే.. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెబుతున్న ఇన్నోవాలో మాత్రం ఏమేం స్వాధీనం చేసుకున్నారన్న విషయం మాత్రం బయటకు రాకపోవటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత.. ఇన్నోవా కారును నీట్ గా సర్వీస్ చేయించారని.. దీంతో కీలక ఆధారాలు మాయం అయినట్లుగా చెబుతున్నారు.

అయితే.. శనివారం స్వాధీనం చేసుకున్న ఇన్నోవాలో వేలిముద్రలు లభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఏమైనా.. కీలక ఆధారాల లభ్యతకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించకపోవటం.. గోప్యతను ప్రదర్శించటంతో అసలేం జరుగుతుందన్న విషయంపై కన్ఫ్యూజన్ నడుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తున్న కొన్ని అంశాలు సంచలనంగా మారుతున్నాయి.