Begin typing your search above and press return to search.
ఎంపీగారమ్మాయ్.. మేయరయ్యేనా?
By: Tupaki Desk | 17 Feb 2021 8:20 AM ISTఔను! ఎంపీగారి గారాలపట్టి.. మేయర్ పీఠంపై కూర్చుంటుందా? ఆ ఎంపీగారి ఏడాదిన్నర కల నెరవేరు తుందా? అంటే.. పెదవి విరుస్తున్నారు బెజవాడ ప్రజలు! ఆశ్చర్యంగా అనిపించినా.. తాజాగా జరుగుతున్న పరిణామాలు.. గంట గంటకు మారుతున్న రాజకీయ పరిస్థితులు.. వంటివి ఎంపీగారి కుమార్తె రాజకీయంపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని.. తన కుమార్తె శ్వేతను రాజకీయ బరిలోకి తీసుకువచ్చారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి తరఫున సుడిగాలి పర్యటన చేసి.. ఆయన గెలుపునకు ఇతోధికంగా కృషి చేసిన శ్వేత.. తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అప్పట్లో అందరినీ కలుపుకొనిపోయిన.. ఎంపీ నాని.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
అయితే.. అనూహ్యంగా అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక, ఆ తర్వాత.. ఎంపీకి.. పార్టీలో ఇతర నేతలకు మాత్రం.. గ్యాప్ పెరిగిపోయింది. ఆయన దూకుడుతో.. చాలా మంది నాయకులు. ఆఖరుకు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఆయనకు దూరమయ్యారు.
ఇక, ఇదే మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్న వారు కూడా కేశినేనితో అంటీ ముట్టనట్టు ఉన్నారు. దీంతో ఏడాదిన్నరగా కేశినేని రాజకీయం ఒకవైపు.. ఇతర నేతల రాజకీయం మరోవైపు.. అన్నట్టుగా తయారైంది. ఫలితంగా వర్గ పోరుతోపాటు.. నాని ఒంటరి అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజా గా నోటిఫికేషన్ వెలువడడం.. ప్రచారం ప్రారంభించడం వంటివి.. జరిగినా.. నాని వెంట చాలా తక్కువ మంది ఉండడం గమనార్హం అంతేకాదు.. కీలక నేతలు గ్రూపుగా వేరే వ్యూహం వేసుకుని ముందుకు సాగడం కూడా ఎంపీ గారి గారాలపట్టి.. మేయర్ అయ్యే ఛాన్స్‌ను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.