Begin typing your search above and press return to search.
బెజవాడ రాజకీయాల్లో కేశినేని ఫైర్ బ్రాండ్
By: Tupaki Desk | 11 March 2020 12:53 PM ISTబెజవాడ అంటేనే రౌడీలు రాజకీయాల పేరు గుర్తుకువస్తుంది. వంగవీటి రంగా ఆ కాలం నాటి కక్షలు, కార్పణ్యాలపై ఎన్నో వివాదాలున్నాయి. ఇప్పటికీ బెజవాడ రగులుతున్న అగ్ని పర్వతమే..
తాజాగా బెజవాడ రాజకీయాల్లోకి మరో యువ నేత పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. ఇప్పటివరకూ బెజవాడ రాజకీయాల్లో ఎంపీగా రాణించి.. తన కంటూ ఫైర్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బెజవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా తన కూతురును రాజకీయ తెరపైకి తీసుకొచ్చారు. విజయవాడ మేయర్ పీఠం గెలుచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
విజయవాడలోని పదో డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేతా చౌదరి రంగంలోకి దిగింది. ఈమెను విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది.
2014 ఎన్నికల్లో తొలిసారి విజయవాడ ఎంపీగా కేశినేని నాని పోటీచేశారు. అమెరికాలో ఉన్న ఆయన కూతురు శ్వేత నాన్న గెలుపుకోసం విజయవాడలో దిగి తండ్రి తరుఫున ప్రచారం చేసి గెలిపించారు. ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్లిపోయారు. 2016లో హిల్లరీ క్లింటన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. డెమోక్రాట్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం ఇండియాకు వచ్చేసారు. 2019లో విజయవాడ ఎంపీగా కేశినేని నాని పోటీచేయగా.. శ్వేత ప్రచారం చేసి అండగా నిలిచారు. గెలిపించారు. ఎమ్మెల్యేలను కూడా గెలిపించి మరి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బెజవాడ మేయర్ అభ్యర్థిగా లక్కీ చాన్స్ అందుకున్నారు.