Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి వియ్యంకుడికి ఏడాది జైలు శిక్ష

By:  Tupaki Desk   |   30 Jun 2017 7:19 AM GMT
ఏపీ మంత్రి వియ్యంకుడికి ఏడాది జైలు శిక్ష
X
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి ఏకంగా మంత్రి పదవిని కొట్టేసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి పాపం ఊహించని షాక్ తగిలింది. ఆయన వియ్యంకుడు కేశవరెడ్డికి ఏడాది జైలు శిక్ష పడింది. కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత అయిన ఆయన ఇప్పటికే పలు కేసుల్లో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి… తిరిగి చెల్లించని కేసులో ఇరుక్కున్న కేశవరెడ్డికి చెక్‌ బౌన్స్‌ కేసులో కర్నూలు కోర్టు ఈ శిక్ష విధించింది. అలాగే చెక్కు మొత్తం రూ. 25 లక్షలు రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

గతంలో ఎన్‌ బాలయ్య అనే వ్యక్తి వద్ద కేశవరెడ్డి రూ.25 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు చెల్లించడంలో భాగంగా ఈ చెక్ ఇచ్చారు. అయితే ఆయన అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో అది బౌన్సయింది. దీంతో బాలయ్య కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు కేశవరెడ్డిపై నేరం రుజువైనట్టు ప్రకటిస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది.

డిపాజిట్ల ఎగవేత కేసులోనూ కేశవరెడ్డి కొద్దిరోజుల క్రితం అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి చేరడం వెనుక కేశవరెడ్డిని రక్షించుకోవడం కూడా ఒక టార్గెట్ ఉందని అంటారు. అయితే... ఆర్థిక నేరాల్లో చిక్కుకున్న కేశవరెడ్డి వ్యవహారాలు రాజకీయ పరిధి దాటి కోర్టుల్లో ఉన్నందున ఆదినారాయణ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/