Begin typing your search above and press return to search.
వణికిపోతున్న కేరళ
By: Tupaki Desk | 12 Aug 2021 2:00 PM ISTకరోనా వైరస్ కొత్త వేరియంట్లతో కేరళ వణికిపోతోంది. కేరళలో కొత్త కొత్త వేరియంట్లు బయటపడుతుండటంతో ఏమి చేయాలో ప్రభుత్వానికి అర్ధం కావటంలేదు. కోవిడ్ రెండు టీకాలు తీసుకున్న సుమారు 40 వేలమందికీ కరోనా వైరస్ సోకటం ప్రభుత్వంతో పాటు ప్రజల్లో కూడా టెన్షన్ పెంచేస్తోంది. మామూలుగా అయితే టీకాలు తీసుకున్న వారికి కరోనా రాదని చాలామంది జనాల్లో అభిప్రాయముంది. అయితే ఆ అభిప్రాయం నూరుశాతం తప్పని తాజా కేసులతో తేలిపోయింది.
సురక్షితంగా ఇంట్లో ఉండటమే అసలైన రక్షణ చర్యలుగా శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు ఎంత చెబుతున్నా జనాలు పట్టించుకోవటంలేదు. ఇపుడు కేరళలో జరుగుతున్నది కూడా ఇదే. జూలై నెలలలో బక్రీదని, తర్వాత ఓణమ్ అని లాక్ డౌన్ను ప్రభుత్వం ఎత్తేసింది. పండుగల పేరుతో జనాలు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేశారు. అసలే కేరళలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా నెమ్మదిగా జరుగుతోంది. దానికితోడు జికా వైరస్ లాంటి అనేక వైరస్ లు బయటపడుతున్నాయి.
ఇలాంటి సమయంలో కోవిడ్ నిబంధనలను జనాలు యధేచ్చగా ఉల్లంఘించటంలో వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో కరోనా వైరస్ భారిన పడిన వేలాదిమందిని పరీక్షించారు. పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ గా బయటపడిన వారిలో 40 వేలమంది రెండు టీకాలు తీసుకున్నవారే అని బయటపడింది. కొత్త వేరియంట్ల కారణంగా టీకాలు కూడా కరోనా వైరస్ ను అడ్డుకోలేకపోతోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా కరోనా వైరస్ నెగిటివ్ రిపోర్టుకానీ లేదా వ్యాక్సినేషన్ వేసుకున్న రిపోర్టుకానీ లేకపోతే జనాలను రోడ్లపైకి రానిచ్చేది లేదని ప్రభుత్వం జారీచేసిన తాజా ఉత్తర్వులు జనాల్లో మరింత గందరగోళానికి నెట్టేసింది.
ఎందుకంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా నెమ్మదిగా జరుగుతోంది. 18-49 ఏళ్ళమధ్యలోని వారిలో వ్యాక్సినేషన్ వేయించుకున్నది కేవలం 28 శాతమే. దీంతో వ్యాక్సినేషన్ వేయించుకోని వాళ్ళు ఇక బయటకు వచ్చేందుకు లేదా ? అని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మొదటి దశలో కరోనాను చక్కగా నియంత్రించిన రాష్ట్రంగా యావత్ దేశంలో కేరళ రోల్ మోడల్ గా నిలబడింది. అలాంటిది రెండోదశ మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో అంతా ఫెయిల్యూర్లే. ప్రతిరోజు నమోదవుతున్న కేసులను ఎలా నియంత్రించాలో అర్ధంకాక ప్రభుత్వం కూడా చేతులెత్తేయటంతో ప్రజలంతా వణికిపోతున్నారు.