Begin typing your search above and press return to search.

కేరళ చాలా సురక్షితమైన ప్రదేశం..మళ్లీ తప్పక వస్తా

By:  Tupaki Desk   |   21 April 2020 12:34 PM GMT
కేరళ చాలా సురక్షితమైన ప్రదేశం..మళ్లీ తప్పక వస్తా
X
"నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్లు, నర్సులు, అధికారులు ఇలా ప్రతీ ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. కరోనా మహమ్మారి నుండి ప్రపంచం బయటపడి అన్ని పరిస్థితులు మళ్లీ అనుకూలంగా ఉన్న సమయంలో మళ్లీ ఇక్కడికి వస్తాను. కేరళ చాలా సురక్షితమైన ప్రదేశం’’ అని కరోనా నుంచి కోలుకున్న ఇటాలియన్‌ పర్యాటకుడు రాబర్టో టోనిజో హర్షం వ్యక్తం చేశారు. అసలు ఈ రాబర్టో టోనిజో ఎవరు , కేరళ గురించి ఎందుకు ఎలా చెప్పాడు అంటే ?

రాబర్టో మార్చి 13న కేరళ అందాలను వీక్షించేందుకు భారత్‌ కు వచ్చారు. అయితే , అప్పటికే దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైంది. ఈ నేపథ్యంలో అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. దీనితో వెంటనే అతడిని క్వారంటైన్‌ కు పంపిన కేరళ ప్రభుత్వం , ఐసోలేషన్ లో ఉంచి కరోనా కి చికిత్స అందించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో అతడికి నెగటివ్ అని వచ్చింది.

దీనితో అతడిని సోమవారం డిశ్చార్జ్‌ చేశారు. అనంతరం రాబర్టోను బెంగళూరు కు ప్రత్యేక వాహనంలో తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి అతడు ఇటలీకి వెళ్లనున్నాడు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన రాబర్టో.. కేరళ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేరళ నా ఇల్లు వంటిది. ఇక్కడ ఎవరైనా సురక్షితంగా ఉండగలరు. ఇప్పుడు నేను నా దేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంది. అయితే మరోసారి కచ్చితంగా ఇక్కడికి వస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా మున్నార్‌ లో ఓ క్వారంటైన్‌ సెంటర్‌ లో ఉన్న ఏడుగురు విదేశీయులుకరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఏప్రిల్‌ 9న వెల్లడించిన సంగతి తెలిసిందే.