Begin typing your search above and press return to search.

కేర‌ళ‌కు మాన‌వ సేవ కావాలి

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:39 PM GMT
కేర‌ళ‌కు మాన‌వ సేవ కావాలి
X
ఇది కొత్త. ఇది నూతన ఒరవడి. ఇది సరికొత్త అవసరం. ఇది వాస్తవానికి నిజమైన రూపం. ఇదంతా ఏమిటనుకుంటున్నారా. ఏం లేదు. వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ ప్రజలకు కావాల్సింది వారికి స్పష్టత ఉంది. లేనిదల్లా వారికి సాయం చేస్తున్నాం అనుకునే వారికే. గడచిన వారం - పది రోజులుగా కేరళ రాష్ట్రం వర్షాలు - వరదలతో ఇబ్బందులు పడుతోంది. ఇదే అదనుగా దేశంలోని అన్ని రాష్ట్రాల వారు వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇది మానవతా ద్రక్పదమే. అయితే అక్కడి పరిస్థితి వేరేలా ఉంది. దీన్ని అర్ధం చేసుకుని తమకు సాయం చేయాలని కేరళీయులు కోరుకుంటున్నారు. వర్షాలు పడగానే... వరదలు రాగానే అన్ని ప్రభుత్వాలు - అన్ని సంస్ధలు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అంతే ఎక్కడిక్కకడ సాయం శిబిరాలు వెలిసాయి. ఇళ్లలో పాత బట్టలు. పాత సామన్లు.... వారికి పనికి రాకుండా పోయిన వస్తువులను కేరళకు తరలించేందుకు అందరూ ముందుకు వచ్చారు. ఇందులో అగ్గిపెట్టెలున్నాయి. ఇందులో కొవ్వొత్తులున్నాయి. ఇందులో పాత బట్టలున్నాయి. డబ్బులు కూడా ఉన్నాయి. అయితే ఆ సాయం తమకు అవసరం లేదని - తమకు కావాల్సింది మనిషులని కేరళీయులు కుండబద్దలు కొట్టారు. ఇందు కోసం వారు ఏకంగా ఆడియోలను విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికి పంపుతున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమకు కావాల్సింది పాత బట్టలు - అగ్గిపెట్టెలు - కొవ్వొత్తులు కాదని వారు తేల్చి చెబుతున్నారు. కేరళలో సామాన్యులు అతి తక్కువగా ఉన్నారని - వారికి ఇప్పటి వరకూ పంపినవి సరిపోతాయని అంటున్నారు. నిజానికి ఇవన్నీ కొచ్చిలో పేరుకుపోయాయని వారు అంటున్నారు. మాకు డబ్బులు కూడా అవసరం లేదని వారు చెబుతున్నారు. మరి వారికి ఏం కావాలంటున్నారు. ఏం కాదు మనిషి సాయం కావాలంటున్నారు.

కేరళలో ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది పెయింటర్లు - వడ్రం పనివారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చేతి వ్రత్తులకు చెందిన వారి సాయం తమకు అవసరమని వారు చెబుతున్నారు. వరదల కారణంగా ఇళ్లు పూర్తిగా పాడైపోయాయని - వాటిని బాగు చేసేందుకు ఎలక్ట్రీషియన్లు - కార్పెంటర్లు - పెయింటర్లు కావాలని కోరుతున్నారు. అంతే కాదు.... తమకు వరదల వల్ల వచ్చిన అంటువ్యాధులు - ఇతర వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు డాక్టర్లు కూడా కావాలని కోరుతున్నారు. కేరళకు సాయం పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేయాలనుకుంటే దానికి సహకరించవద్దని కూడా చెబుతున్నారు. తమకు అవసరమైన డబ్బు ఉందని, తమకు కావాల్సింది మానవ సేవే అని వారంటున్నారు.