Begin typing your search above and press return to search.

కేరళ బాధితులపై సెటైర్.. ఉద్యోగం ఊడింది..

By:  Tupaki Desk   |   20 Aug 2018 8:45 AM GMT
కేరళ బాధితులపై సెటైర్.. ఉద్యోగం ఊడింది..
X
ప్రకృతి ప్రకోపానికి కేరళ అతలాకుతలం అవుతోంది. కేరళ వాసులు వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. అందరూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది ఈ విషాధం పట్ల స్పందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సైనిక బలగాలు.. వివిధ స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. కానీ ఇక్కడో కేరళవాసి సొంత రాష్ట్రంలోని వరద బాధితుల గురించి చేసిన కామెంట్ సభ్యసమాజానికే తలవంపులు తెచ్చేలా ఉంది. నోరుజారినందుకు ఇతడిని ఉద్యోగం నుంచి తీసేస్తూ సదురు కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.

గల్ఫ్ లోని ఒమన్ దేశంలో ఉన్న ప్రఖ్యాత లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీలో కేరళకు చెందిన రాహుల్ చెరు పళయట్టు క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. కేరళ వరదల నేపథ్యంలో బాధితులకు సోషల్ మీడియాలో సానుభూతి పోస్టులు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ‘శానిటరీ నాప్ కీన్లు’ కూడా మహిళల కోసం అందజేయాలని ఫేస్ బుక్ లో జోక్ చేశాడు. ఈ పోస్టుకు స్పందించిన రాహుల్ చెరు ‘కండోమ్ లు కూడా అవసరమే’ అని సెటైర్ పోస్టు పెట్టాడు.

ఈ పోస్టు వైరల్ కావడం.. లులు యాజమాన్యం దృష్టికి కూడా వెళ్లడంతో సదురు కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతడిని ఉద్యోగం లోంచి తీసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

రాహుల్ ఉద్యోగం ఊడిపోవడంతో తప్పు తెలుసుకొని ఫేస్ బుక్ లో క్షమాపణలు చెప్పారు. ‘ఆ కామెంట్ చేసిన సమయంలో తాను మద్యం తాగి ఉన్నానని.. ఏం మాట్లాడుతున్నానో తెలియలేదు అని ఫేస్ బుక్ లో లైవ్ వీడియోలోకి వచ్చి వివరించారు’. అయితే రాహుల్ క్షమాపణలను లులు కంపెనీ అంగీకరించలేదు. ఇలాంటి ఘటనలను తాము సమర్ధించమని.. తమ సంస్థ మానవ సంబంధాలు, నైతిక విలువలకు కట్టుబడి ఉంటుందని. అందుకే రాహుల్ ను తీసేస్తున్నామని కంపెనీ స్పష్టం చేసింది.