Begin typing your search above and press return to search.

అదృష్టమంటే వీడిదే: పుట్టిన ఏడాదికే కోటీశ్వరడు

By:  Tupaki Desk   |   6 Feb 2020 2:33 PM IST
అదృష్టమంటే వీడిదే: పుట్టిన ఏడాదికే కోటీశ్వరడు
X
కోటీశ్వర్లు కావాలని సామాన్యుల కళ. పొట్టకూటి కోసమే రేయింబవళ్లు కష్టించే పని చేసే వారికి కోట్లు సంపాదించడం అసాధ్యం. కలలో కూడా జరగని పని. కానీ కేరళ లో ఏడాది బాలుడి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదృష్టం

కలిసి రావడంతో ఆ రూ.7 కోట్లు సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లో భారతీయ చిన్నారికి ఈ అదృష్టం వరించింది. రాఫిల్ డ్రాలో ఒక మిలియన్ డాలర్లను (సుమారు రూ.7 కోట్లకు పైగా) గెలుచుకున్నాడు. కేరళ నుంచి దుబాయ్ కు అత్యధిక సంఖ్యలో వెళ్తుంటారు. అందుకే గతేడాది వరదలు ముంచెత్తడంతో సౌదీ రాజు వందల కోట్లు విరాళంగా ప్రకటించిన విషయం. ఇదే కేరళ కు చెందిన రమీస్ రెహ్మాన్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతడు లాటరీలు కూడా వేస్తుంటాడు. అందులో భాగంగా తన అదృష్టం పరీక్షించుకోవాలని ఏడాది వయసు ఉన్న తన కుమారుడు మెుహమ్మద్ సలాహ్ పేరు తో లాటరీ టికెట్ కొన్నాడు. లాటరీ సంస్థ ఫిబ్రవరి 4న నిర్వహించిన రాఫిల్ లక్కీడ్రా లో 323 సిరీస్ తో తన కుమారుడి పేరుతో కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 1319 ఉందిం. దీంతో అతడు ఏకంగా రూ.7 కోట్ల కు పైగా నగదును సొంతం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి రహ్మన్ ఉబ్బితబ్బిబయ్యాడు.

ఈ వార్త తనకి ఎంతో గొప్పదని, తనకి చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భం గా రహ్మన్ తెలిపాడు. లాటరీ ద్వారా గెలుచుకున్న డబ్బు తన కుమారుడి భవిష్యత్తు కు ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చాలా మంది భారతీయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోని అదృష్ట వంతులు అయిన విషయం తెలిసిందే. గత సంవత్సరంలో ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయ రైతు కూడా రాఫిల్ లక్కీడ్రాలో 4 మిలియన్లు డాలర్లను గెలుచుకుని అదృష్ట వంతుడు అయ్యాడు.