Begin typing your search above and press return to search.

ఒప్పుకొని శృంగారం చేసినా.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   8 July 2020 3:15 PM IST
ఒప్పుకొని శృంగారం చేసినా.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
X
ఒక బాలిక ఒప్పుకుంది.. నువ్వు అడగ్గానే నీతో శృంగారం చేసింది. ఉడుకు నెత్తురు పిల్ల.. లోకం గురించి తెలియదు.. ఆ వేడిని చల్లార్చుకోవడానికి శృంగారానికి ఓకే చెప్పింది. అయితే ఆ పురుషుడు ఎవరితో శృంగారం చేస్తుందనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అంగీకారంతో శృంగారం చేసినా అది తీవ్రమైన నేరమే. ఎందుకంటే ఆమె బాలిక కాబట్టి. శృంగారానికి కొత్త నిర్వచనం చెప్పి కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

2009లో కేరళలో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థిని టీవీ చూసేందుకు నిందితుడి ఇంటికి వచ్చింది. మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకొని ఆ నిందితుడు అదే పని పెట్టుకున్నాడు. టీనేజ్ లో లోకం పోకడ తెలియని అమయాక బాలిక ఆ వేడి ఉద్రేకంలో కమిట్ అయిపోయింది. ఫలితంగా గర్భం దాల్చింది.

నిందితుడిని దోషిగా తేల్చి కింద కోర్టు కఠిన శిక్ష విధించింది. దీనిపై హైకోర్టుకు ఎక్కిన నిందితుడు పరస్పర అంగీకారంతోనే తాను బాలికతో శృంగారం చేశానని.. ఇది నేరం కాదంటూ వాదించాడు.

కానీ హైకోర్టు శృంగారానికి కొత్త నిర్వచనం చెప్పింది. ఒక మెచ్యురిటీ తీరిన మహిళ... పురుషుడిని ఆహ్వానిస్తేనే అది పరస్పర అంగీకార శృంగారమని.. మైనర్ బాలిక సమ్మితిని పరస్పర అంగీకారంతో కూడిన శృంగారంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఒక మహిళ పురుషుడికి లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని స్పష్టం చేసింది. అతడికి శిక్షను అమలు చేయాలని తీర్పునిచ్చింది.