Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ సడలింపు పై కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం !

By:  Tupaki Desk   |   18 April 2020 4:00 PM GMT
లాక్ డౌన్ సడలింపు పై కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం !
X
కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌ డౌన్‌ను సోమవారం నుంచి పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా తీవ్రత ఆధారంగా జిల్లాలను రెడ్‌ - ఆరెంజ్ ఏ - ఆరెంజ్‌ బీ - గ్రీన్‌ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కాసర్‌ గడ్‌ - కన్నూరు - మలప్పురం - కోజికోడ్‌ జిల్లాలను రెడ్‌ జోన్‌ కింద పరిగణిస్తూ... ఆ జిల్లాల్లో లాక్ డౌన్ యథాతథంగా ఉంటుంది అని తెలిపింది. హాట్‌ స్పాట్లను సీల్‌ చేసి ఉంచుతామని, కేవలం నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే రెండు మార్గాలు తెరచి ఉంచుతామని తెలిపింది.

అలాగే , మిగతా జిల్లాల్లో సరి- బేసి విధానంలో ప్రైవేటు వాహనాలను రోడ్ల మీదకు అనుమతించబోతున్నట్టు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో రెస్టారెంట్లను రాత్రి ఏడు గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వబోతున్నట్టు తెలిపింది. అలాగే అంతర్‌ జిల్లాలో బస్సులు నడుపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రతీ ఒక్కరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్‌ జోన్‌ కిందకు చేర్చిన కేరళ సర్కార్ సోమవారం నుంచి అక్కడ లాక్‌ డౌన్‌ ను ఎత్తివేయనన్నుటు తెలిపింది.

గ్రీన్‌ జోన్‌ పరిధిలో..

దేశీయ - అంతర్జాతీయ వైమానిక ప్రయాణాలు నిషిద్ధం - రైళ్ల రాకపోకలు బంద్‌ - మెట్రో సర్వీసులు మూసివేత - సినిమా హాళ్లు - మాళ్లు - షాపింగ్‌ కాంప్లెక్సులు - స్విమ్మింగ్‌ పూల్స్‌ తదితర ప్రదేశాలు మూసి ఉంచాలి.

బహిరంగ సమావేశాలు నిషిద్ధం - మతపరమైన స్థలాలు మూసివేత - పెళ్లిళ్లు - అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 20 లోపు ఉండాలి. అనుమతి తీసుకోవాలి.