Begin typing your search above and press return to search.
ఆ స్కాంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళ సర్కార్ సేఫ్
By: Tupaki Desk | 25 Aug 2020 12:15 PM ISTదేశమంతా ఒకలాంటి పరిస్థితి ఉంటే.. కేరళలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని దేశానికి పరిచయం చేసిన కేరళ రాష్ట్రం.. మొదట్లో పెద్ద ఎత్తున తీసుకున్న చర్యలతో కేసుల నమోదు చాలా తక్కువగా ఉండేది. ఒక దశలో కేరళ సర్కారు మోడల్ ను మిగిలిన రాష్ట్రాలు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. చాలా రాష్ట్రాల్లో రోజుకు వందల్లో.. వేలల్లో కేసులు నమోదు అవుతున్న వేళ.. కేరళలో మాత్రం పదుల సంఖ్యలో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు కావటంపై హర్షం వ్యక్తం కావటమే కాదు.. పినరయి సర్కారుకు భారీ మైలేజీ వచ్చేలా చేసింది.
ఇలాంటివేళ.. అనూహ్యంగా గోల్డ్ స్కాంలో చిక్కుకున్న ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలించే బంగారం కుంభకోణంలో సీఎంవో పాత్ర ప్రముఖంగా ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లే.. సీఎంవో పని చేసే మహిళ పేరు ప్రముఖుంగా వినిపించటంతో పినరయి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఇలాంటివేళ.. గళం విప్పిన కాంగ్రెస్.. కేరళ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది.
ఈ తీర్మానంపై కేరళ అసెంబ్లీలో చర్చ సాగింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయగా..అవిశ్వాసానికి వ్యతిరేకంగా 87 మంది ఓటేసి..మద్దతుగా నిలిచారు. దీంతో.. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లుగా స్పీకర్ వెల్లడించారు. ఇప్పటికే గోల్డ్ స్కాంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి తాజా పరిణామం భారీ ఊరట ఇస్తుందని చెప్పక తప్పదు.