Begin typing your search above and press return to search.
కేరళ సీఎంకు ఉన్న ధైర్యం ఏపీ - తెలంగాణ సీఎంలకు లేదా?
By: Tupaki Desk | 1 Sept 2020 4:00 PM ISTకేంద్రంలోని మోడీ సర్కారు షావుకారిలాగా లెక్కలు వేసి మరీ రాష్ట్రాలకు జీఎస్టీ విషయంలో కోతలు పెడుతున్న తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి అయినా కాస్త గట్టిగానే నిలదీశాడు. కమ్యూనిస్టు కాబట్టి ఆ మాత్రం ధైర్యం చూపారు. కానీ మన తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఏం అలిగేషన్స్ ఉన్నాయో కానీ ఇద్దరూ యాంటిమెంట్ పూసినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ డబ్బులు, బకాయిలు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన దగ్గరే పెట్టుకొని మీరు అప్పులు తెచ్చుకోండి అని అనడం కరెక్ట్ కాదని కేరళ ముఖ్యమంత్రి విజయన్ పెద్ద ఎత్తున నిరసన తెలిపాడు. అన్ని విధాలుగా నష్టపోతున్నామని.. మా రాష్ట్రాలకు రావాల్సిన డబ్బులు ఇవ్వండని కేరళ సీఎం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
కానీ ఘనత వహించిన మన తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం ఏదో మొక్కుబడిగా అడుగుతున్నారు తప్పితే పోరాడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం కోసం కేసీఆర్ ఎలా ఉద్యమించారు. సీఎం అవ్వడానికి 3వేల కిలోమీటర్ల పాదయాత్రను వైఎస్ జగన్ చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రాల హక్కుల కోసం ఫైట్ చేయలేకపోతున్నారన్న అపవాదును తెలుగు రాష్ట్రాల సీఎంలు మూటగట్టుకుంటున్నారు. ఫైట్ చేస్తే కానీ కేంద్రం పైసా విదిల్చే పరిస్థితి లేదని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ఇలా అయితే రాష్ట్రాలు జీఎస్టీ లోకి ఎందుకు వెళ్లాలని కూడా అంటున్నారు.
3 లక్షల కోట్లు జీఎస్టీ బకాయిలు రాష్ట్రాలకు రావాల్సి ఉంది. కానీ కేంద్రం కేవలం 1.65 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తామంటోంది. ఇలా అయితే రాష్ట్రాలు ఎలా బాగు చేసుకోవాలని.. సాలరీలు ఎలా ఇవ్వాలని.. అభివృద్ధి ఆగిపోతుందని అని వాపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం మామూలుగా అడిగితే ఇవ్వదని అందరికీ అర్థమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసి గట్టిగా పట్టుబడితే తప్ప ఇవ్వదు అని మేధావులు అంటున్నారు.