Begin typing your search above and press return to search.

కరోనాకు ఫ్లాస్మా థెరపీతో చెక్..కేరళకు అనుమతి

By:  Tupaki Desk   |   11 April 2020 2:30 AM GMT
కరోనాకు ఫ్లాస్మా థెరపీతో చెక్..కేరళకు అనుమతి
X
కరోనా కబళిస్తోంది. ప్రపంచంలో మరణ మృదంగం వినిపిస్తోంది. ఇప్పటివరకు మందు లేని ఈ వ్యాధిని అరికట్టడం ఎలాగో తెలియక శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వాక్సిన్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే తాజాగా కరోనా రోగులకు ‘ప్లాస్మా థెరపీ’ సత్ఫలితాలను ఇస్తోంది. అమెరికా - చైనా - దక్షిణ కొరియాలో దీంతో చికిత్స చేసిన రోగులకు కరోనాను జయించారు. దీంతో మన భారత్ లోనూ ఇప్పుడు ఈ చికిత్స చేయాలని వైద్యులు భావిస్తున్నారు.

తాజాగా ఫ్లాస్మా చికిత్స చేయడానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కేరళ రాష్ట్రానికి అనుమతులు ఇచ్చింది. మరికొన్ని రాష్ట్రాలకు కూడా అనుమతులు ఇవ్వడానికి రెడీ అయ్యింది.

దక్షిణ కొరియాలో ఇద్దరు వృద్ధులు ‘ప్లాస్మా థెరపీ’తో కరోనా వైరస్ నుంచి విముక్తి కావడం విశేషంగా మారింది. కరోనా సోకిన వారికి ప్లాస్మాతో చికిత్స చేయగా.. తీవ్రమైన న్యూమోనియా లక్షణాల నుంచి కూడా వీరు బయటపడడం విశేషంగా మారింది.

ఇప్పుడు ఈ ప్లాస్మా చికిత్స ప్రపంచానికి ఆశాజనంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ‘ప్లాస్మా థెరపీ’ ప్రస్తుతానికి మెరుగైనదిగా కనిపిస్తోందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*ఫ్లాస్మాను ఎలా తీస్తారు?

రక్తంలో కలిసుండే జిగురులాంటి పారదర్శక పదార్థాన్నే ప్లాస్మా అంటారు. కరోనా వైరస్ సోకి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ తయారవుతాయి. ఆ యాంటీ బాడీలు రక్తంలోని ఫ్లాస్మాలో ఉంటాయి. వారి రక్తంలోని ఫ్లాస్మాను 200 ఎంఎల్ తీసి కరోనా సోకిన రోగిలోకి ఎక్కిస్తే వారు కూడా కోలుకుంటారు. యాంటీ వైరల్ మందులకు స్పందించని ఇద్దరు సీరియస్ గా ఉన్న వృద్ధులకు ప్లాస్మా థెరపీ చికిత్స చేస్తే కోలుకున్నారని వైద్యులు తెలిపారు. ఇది కరోనాపై అద్భుత విజయంగా అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు సౌత్ కొరియా వైద్యులు కరోనాను జయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి తేనున్నారు.