Begin typing your search above and press return to search.

విమాన రాకపోకలు: కేజ్రీ, సివిల్ ఏవియేషన్ పట్టు

By:  Tupaki Desk   |   23 March 2020 10:30 AM GMT
విమాన రాకపోకలు: కేజ్రీ, సివిల్ ఏవియేషన్ పట్టు
X
కరోనా వైరస్ దేశాన్ని భయపెడుతోంది. మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది. దీంతో దేశంలోకి విదేశీయులు రాకుండా భారత్ నిషేధించింది. ఇక దేశీయ విమానాల రాకపోకలపై కూడా నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారితో కరోనా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా ఢిల్లీలో ప్రబలుతున్న కరోనా వైరస్ ను నియంత్రించడానికి సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఢిల్లీలో దేశీయ విమానాలు కూడా తిరగవని స్వయంగా ప్రకటించారు.

అయితే ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి దేశీయ విమానాలు యథావిధిగానే పనిచేస్తాయని ప్రకటించారు.

దీంతో లాక్ డౌన్ పేరిట కేజ్రీవాల్ చేస్తున్న కరోనా కట్టడి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఓ వైపు సీఎం కేజ్రీవాల్.. మరోవైపు సివిల్ ఏవియేషన్ అధికారుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఢిల్లీలో విమాన రాకపోకలపై సందిగ్ధం ఏర్పడింది.