Begin typing your search above and press return to search.
నాగరాజు లీలలు అన్నిఇన్ని కావా? టైపిస్టుగా షురూ చేసి..
By: Tupaki Desk | 15 Aug 2020 11:45 AM ISTశుక్రవారం రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత.. సుమారు రాత్రి పది గంటలు దాటిన సమయంలో ఒక్కసారిగా న్యూస్ చానళ్ల తెరల మీద బ్రేకింగ్ న్యూస్ పడటం తెలిసిందే. కీసర ఎమ్మార్వో నాగరాజు రూ.1.10కోట్ల భారీ మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యాడు. రెవెన్యూ శాఖలో అవినీతి ఒక రేంజ్ లో ఉంటుందన్న మాట వినిపించినా.. దాని రేంజ్ ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటంలో తాజా ఉదంతం పక్కాగా మారిందని చెప్పాలి.
విలువైన యాభై మూడు ఎకరాల భూమిని ఒకరికి అనుకూలంగా మార్చేయటానికి ఈ భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లుగా చెప్పాలి. తాజాగా ఏసీబీకి పట్టుబడ్డ నాగరాజు వ్యవహారంలోకి వెళితే.. అతడి వెనుకటి చరిత్ర మొత్తం అవినీతి.. ఆరోపణలు.. విమర్శలతో నిండి ఉంటాయనిచెబుతారు. రెవెన్యూ శాఖలో సాదాసీదా ఉద్యోగిగా షురూ చేసి.. ఈ రోజున భారీ ఎత్తున వసూళ్ల కార్యక్రమాన్ని చేపట్టే పరిస్థితి ఎలా సాధ్యమన్నది చూస్తే.. ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూశాయి.
రెవెన్యూ శాఖలో టైపిస్టుగా తన ప్రస్థానాన్ని షురూ చేసిన నాగరాజు.. లంచం విషయంలో మాత్రంచాలా కరాఖండిగా ఉంటారని చెబుతారు. టైపిస్టుగా మొదలు పెట్టి.. ప్రమోషన్ మీద తహశీల్దార్ స్థాయికి ఎదిగాడు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో ఉన్నప్పుడే ఆయన మీద పలు ఆరోపణలు వచ్చాయని చెబుతారు. రెండేళ్ల క్రితం కూకట్ పల్లి నుంచి కీసరకు బదిలీ మీద వచ్చారు. అప్పటినుంచి పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా చెబుతారు.
గతంలో చీర్యాల గ్రామానికి చెందిన రైతును రూ.లక్ష డిమాండ్ చేయటంతో.. ఆ రైతు సూసైడ్ చేసుకున్నట్లు చెబుతారు. ఈ ఎపిసోడ్ లో సదరు రైతు కుటుంబ సభ్యులు నాగరాజును నిలదీశారు. గతంలో అతగాడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టబడ్డాడు. సస్పెండ్ అయ్యాడు. తనకున్న రాజకీయ పలుకుబడితో ఆ కేసు నుంచి బయటపడటం గమనార్హం. తనకున్న పరిచయాలతో.. ఉన్నతాధికారుల్ని సైతం భలేగా బుట్టలో వేసుకుంటారని చెబుతారు. ఒకప్పుడు లక్షల్లో డిమాండ్ చేసే నాగరాజు.. ఇప్పుడు కోట్లల్లో కూడా డిమాండ్ చేస్తారని చెబుతారు. ఇటీవల ఆయన.. ఆయనతో పాటు మరికొందరు అధికారులు కలిసి ఒక ఉన్నతాధికారికి ఒక విల్లాను బహుమతిగా ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. తవ్వి చూస్తే.. నాగరాజు ఒక వ్యక్తి కాదని.. రెవెన్యూశాఖకు పట్టిన జలగల్లో ఇదొకటిగా చెబుతున్నారు. అధికారుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.