Begin typing your search above and press return to search.
అన్నిటికీ తలుపులు తెరిచే ఉంచా.. మిస్ ఇండియా మానస!
By: Tupaki Desk | 16 Feb 2021 4:41 PM IST'మానస వారణాసి..' నిన్నా మొన్నటి వరకూ పక్క బజారు కూడా తెలియని ఈ పేరు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కారణం.. ఇప్పుడామె ఆమె సాధారణ మహిళ కాదు. మిస్ ఇండియా!ముంబయిలో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో టైటిల్ గెల్చుకున్న 23 సంవత్సరాల మానస వారణాసి.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. మరి, ఈమె గత జీవితం అంటే.. ప్రస్తుతం ఏం చేస్తోంది.. భవిష్యత్ లక్ష్యాలేంటీ? అన్నది మీకోసమే.
నగరానికి చెందిన మానస వారణాసి ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ఛేంజ్ ఎనలిస్ట్‌గా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. మానస తండ్రి అనుమణి వారణాసి, తల్లి శైలజ. ట్రెక్కింగ్, స్కై గేజింగ్ తదితర సాహసాలు ఇష్టపడే మానస.. అనుకోకుండా మోడలింగ్ వైపు మళ్లారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి నేరుగా బ్యూటీ కాంటెస్ట్‌లోకి అడుగుపెట్టిన మానస.. ఏకంగా మిస్ ఇండియా టైటిల్ కొట్టేశారు. మిస్ ఇండియా పోటీలో మొత్తం 31 మంది ఫైనలిస్ట్‌లు పలు రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వారందరినీ వెనక్కి టైటిల్ దక్కించుకున్న మానస.. ఈ అనుభవం మర్చిపోలేనిది అంటున్నారు.
తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మ తో కూడిన చిన్న కుటుంబం తనది అని చెబుతున్న మానస.. అత్యున్నత ఆలోచనలు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం తమదని అంటోంది. అయితే.. ఈ మిస్ ఇండియా టైటిల్ తనను ఎక్కడికి తీసుకెళుతుందో చూడాలని ఆశగా ఉందన్న మానస.. సినిమా రంగంలోకి ప్రవేశిస్తారా.. అంటే మాత్రం కాలం మాత్రమే సమాధానం చెబుతోంది. అయితే.. తనకు ఎదురయ్యే ప్రతీ అవకాశానికి తలుపులు తెరచి ఉంచుతానంటోందీ మిస్ ఇండియా.
ఇక, తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కూడా చెబుతోంది. నగరానికి చెందిన ఎన్జీవో 'మేక్ ఎ డిఫరెన్స్'తో కలిసి పనిచేయడం వల్ల తనలో చాలా మార్పు వచ్చిందని అంటోంది మానస. మిస్ ఇండియా కిరీటం తనకు భవిష్యత్ లో ఎలాంటి స్థానం సమకూర్చినప్పటికీ.. సమాజానికి మాత్రం తన వంతుగా స్వచ్ఛంద సేవ చేస్తానని చెబుతోంది మానస.