Begin typing your search above and press return to search.

మొన్న జేసీ , నేడు కేఈ .. పోలీసులపై ఫైర్ ఏమైందంటే !

By:  Tupaki Desk   |   15 Feb 2020 11:27 AM IST
మొన్న జేసీ , నేడు కేఈ .. పోలీసులపై ఫైర్ ఏమైందంటే !
X
ప్రస్తుతం ఏపీలో వైసీపీ , టీడీపీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకముందే అప్పుడే కొంతమంది టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం , అధికారం లోకి వచ్చిన తర్వాత మీ అంటూ తేలుస్తాం అంటూ, వారి మాటలు పట్టించుకోని కొంతమంది అధికారులపై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు ఇప్పుడు ఏపీ పోలీసులపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. గత కొన్ని రోజులముందు అనంతపురం రాజకీయాలలో కీలకనేత అయిన , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల పై ఒక రేంజ్ లో ఫైర్ అవ్వగా , తాజాగా కర్నూల్ జిల్లాకి చెందిన మరో టీడీపీ నేత అదే స్థాయిలో మరోసారి ఫైర్ అయ్యారు.

కేఈ ప్రభాకర్.. కేఈ కృష్ణమూర్తి సోదరుడిగానే అందరికి బాగా పరిచయం. కర్నూలులో కేఈ సోదరుల హవా బాగానే కొనసాగుతోంది. కానీ ప్రభాకర్ స్వభావం అంత దూకుడు కాదు. కానీ శుక్రవారం కార్యకర్తల సమావేశం లో మాత్రం తన సహజ స్వభావానికి భిన్నంగా రెచ్చిపోయారు. పోలీసులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇప్పుడు లోపలికి వచ్చిన పోలీసులు.. టీడీపీ అధికారంలోకి వస్తే గేటు బయటే ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తామంటే ఏంటో చూపిస్తామని కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. ఇదే సమయంలో గత తొమ్మిదేళ్లుగా సారా వ్యాపారం చేస్తున్నవారిని ఎందుకు వదిలేశారని అధికారులని ప్రశ్నించారు.

గతంలో జేసీ దివాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి , తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తా అని వారిని కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని, వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని, అలాంటివారందరికి టీడీపీ అధికారంలోకి రాగానే తగిన బుద్ది చెప్తాం అని అన్నారు.