Begin typing your search above and press return to search.

ముహుర్తంలో జన్మించిన పిల్లలకు ఉచిత విద్య

By:  Tupaki Desk   |   22 Oct 2015 7:17 AM GMT
ముహుర్తంలో జన్మించిన పిల్లలకు ఉచిత విద్య
X
అమరావతి నగర శంకుస్థాపన సందర్భంగా కర్నూలులో మరో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అమరావతి నిర్మాణం తరాల తరబడి రాష్ట్రమంతటా ప్రజల్లో గుర్తుండిపోవాలన్న లక్ష్యంతో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అమరావతి శంకుస్థాపన ముహూర్తంలో జన్మించే బిడ్డలకు ఉచిత విద్య సదుపాయం కల్పించబోతున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలులో ఈ నిర్ణయాన్ని వెలువరించారు.

కర్నూలు నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో అమరావతి ముహుర్తాన జన్మించిన పిల్లలకు మాజీ మంత్రి కెఈ. ప్రభాకర్‌ గురువారం రూ. 10వేల నగదు అందించడంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కేఈ మహిళలకు ఓ సూచన చేశారు.. ఆడపిల్ల పుడితే 'అమరావతి', మగపిల్లాడైతే 'అమరబాబు' అనే నామకరణం చేయాలన్నారు.