Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌..డిప్యూటీ సీఎం బుజ్జ‌గింపులు చూశావా?

By:  Tupaki Desk   |   8 July 2017 5:57 AM GMT
జ‌గ‌న్‌..డిప్యూటీ సీఎం బుజ్జ‌గింపులు చూశావా?
X
క‌ర్నూలు జిల్లా నంద్యాలకు త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో గెలుపు ఓట‌ముల‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డికి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌ - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్ర‌త్యేక‌మైన సూచ‌న‌లు - స‌ల‌హాలు అందించారు. అదేంటి విప‌క్ష నేత‌కు సాక్షాత్తు ఉప‌ముఖ్య‌మంత్రి సూచ‌న‌లు ఎందుకు ఇస్తారు? అని కంగారు ప‌డ‌కండి. ఎన్నిక‌లో గెలిచేందుకు కేఈ సూచ‌న‌లు ఇవ్వ‌లేదు. పోటీ పెట్ట‌కుండా చూడాల‌ని, త‌ద్వారా మ‌రింత గౌర‌వించే వ్య‌క్తిత్వాన్ని జ‌గ‌న్‌ అందిపుచ్చుకోవాల‌ని కేఈ సూచించారు.

నంద్యాలలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కేఈ కృష్ణ‌మూర్తి విలేక‌రులతో మాట్లాడుతూ మొదటి నుండి రాజకీయ విలువలు పాటిస్తూ మంచి సంప్రదాయాలను కొనసాగిస్తున్న చ‌రిత్ర‌ తెలుగుదేశం పార్టీద‌ని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ల చేతిలో మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబసభ్యుడిని పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసిందన్నారు. 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి మృతి అనంతరం ఆమె కూతురు అఖిలప్రియను పోటీలేకుండా ఎంపిక చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం భూమానాగిరెడ్డి మృతి చెందడంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నికల అనివార్యమైనందున ఈ స్థానాన్ని సైతం ఏకగ్రీవం చేయాల్సి ఉందన్నారు. ఈ క్ర‌మంలోనే పోటీపై వైసీపీ పునరాలోచించాలని అన్నారు. గతంనుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించే విషయంలో వైఎస్‌ జగన్ మరోసారి ఆలోచించాలని కేఈ కోరారు. ఇప్పటికైనా జగన్ చొరవ తీసుకుని నంద్యాల ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని బరిలో దింపకుండా ఏకగ్రీవానికి సహకరిస్తే సంప్రదాయం పాటించినట్లు, నైతిక విలువలు పెంచుకున్నట్టు అవుతుందని హితవు పలికారు.

ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థించ‌డానికే మాత్ర‌మే కేఈ ప‌రిమితం కాకుండా జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు సైతం చేశారు. వైసీపీ అధినేత జగన్ సంప్ర‌దాయాల‌కు విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారని ఆరోపించారు. టీడీపీలో ఉన్న శిల్పామోహన్‌ రెడ్డికి పార్టీ కండువా కప్పి పోటీలో నిలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కాలానికే శిల్పామోహన్‌ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో పోటీకి దిగుతున్నారని, ఏం సాధించేందుకు పోటీ చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ నాయ‌కుడితో పోల్చి జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబునాయుడు 40 ఏళ్లుగా మచ్చలేని రాజకీయ జీవితం గడుపుతున్నారని కేఈ అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న చంద్రబాబుకు జగన్ ఏ విషయంలోను సాటిరారని అన్నారు. అవినీతి, కోర్టు కేసుల్లో మునుగుతున్న జగన్‌ కు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని అన్నారు. జగన్‌ కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని కూడా బురదలో ముంచి వేస్తాడని జోస్యం చెప్పారు.