Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ వ్యూహం : జానారెడ్డికి పోటీగా రంగంలోకి యువనేత !

By:  Tupaki Desk   |   24 Dec 2020 11:53 AM GMT
టీఆర్ఎస్ వ్యూహం :  జానారెడ్డికి పోటీగా రంగంలోకి యువనేత !
X
టిఆర్ ఎస్ కి గత కొన్ని రోజులుగా ఏదీ పెద్దగా కలిసిరావడంలేదు. దుబ్బాక ఉపఎన్నిక లో ఘోర ఓటమి , జీహెచ్ ఎంసి ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో టిఆర్ ఎస్ లో అంతర్మధనం మొదలైంది. టీఆర్‌ ఎస్‌ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు
మరో పెద్ద సవాల్ ‌గా మారాయి. అలాగే , నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి. దుబ్బాక సీన్ రిపీట్ కాకుండా , మరో సిట్టింగ్ చేజారకుండా దీటైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పార్టీ ఉంది. సాధరణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ పార్టీ సభ్యుడికే ఆ సీటు కేటాయిస్తారు.

కానీ, దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవంతో పార్టీ పునరాలోచనలో పడేసింది. దీనితో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీఆర్‌ ఎస్‌ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ ‌ఎస్‌ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌ కు ఈసారి టికెట్‌ దక్కే అవకాశం ఉన్నట్లు ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్ ‌కు కలిసి వస్తుందని, అయన బరిలోకి దిగితే విజయం ఖాయం అని అనుకుంటున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అయన పై ఇప్పటికే సానుకూలాభిప్రాయం ఉంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే స్థానికంగా బలమైన యాదవ సామాజిక వర్గంనికి చెందిన నేత కావడంతో.. సీనియర్లు సైతం ఆయనవైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో రెడ్డి ఓట్లతో పాటు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు. ఇది రంజిత్‌ యాదవ్‌కు కలిసొచ్చే పరిణామం. అయితే దుబ్బాక ఓటమి తో పార్టీ అధిష్టానం ఈ నాగార్జున సాగర్ ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి అభ్యర్థి ఎంపికపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది.