Begin typing your search above and press return to search.

పార్టీ లో ప్రతీకారాన్ని పక్కన పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   16 Nov 2019 11:26 AM GMT
పార్టీ లో ప్రతీకారాన్ని పక్కన పెట్టిన కేసీఆర్
X
తనకు ఎవరైనా ఎదురు తిరిగితే వారికి చుక్కలు చూపించేవరకు నిద్ర పోరని కేసీఆర్ గురించి చెబుతుంటారు. కానీ ఈ మధ్య కేసీఆర్ కొన్ని విషయాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో ఆ సిద్ధాంతాన్ని పక్కనపెట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ లో శివగామి టైపు. ఆయన మాటే శాసనం.. ఆర్టీసీ సమ్మె వద్దంటున్నా చేస్తున్న కార్మికుల విషయం లో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటున్నాడో చూస్తున్నాం. అలాంటి వ్యక్తి కి కూడా ఎదురెళ్లిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. స్వయంగా కేసీఆర్.. తనను వ్యతిరేకించిన వారితోనూ మునుపటి లాగానే సామీప్యం గా కలిసి పోతుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది..

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూశాక ఇప్పుడు గులాబీ దళం సంతోషంగా ఉందట.. అప్పట్లో మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్న ప్రచారం నేపథ్యం లో ఆయన ఎదురు తిరిగారు. 'గులాబీ పార్టీకి ఓనర్లం మేమే' అని హుంకరించాడు. అయినా ఈటెలను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించలేదు. ఏమీ అనలేదు. తాజాగా ఆయన కుమార్తె వివాహానికి కూడా హాజరై ఈటెలను ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్నాడు.

ఇక అప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లో మాదిగలు చోటు కల్పించ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే రాజయ్య మీడియా సాక్షి గా గళమెత్తారు. అతడిని సస్పెండ్ చేస్తారని భావించారు.కానీ స్వయంగా కేసీఆర్ ఇటీవల తనను కలిసిన రాజయ్య ను వెన్ను తట్టి ప్రోత్సహించారట..

ఇది వరకు ఇలానే ధిక్కరించిన ఆలె నరేంద్ర, విజయశాంతి లాంటి సీనియర్లను పార్టీ నుంచి పక్కనపెట్టిన కేసీఆర్ .. ఇప్పుడు మాత్రం తన పార్టీలోని రాజకీయ నేతలు గళమెత్తినా వారిపై కోపం ప్రదర్శించకుండా సర్దుకుపోతుండడం ఆసక్తి రేపుతోంది.