Begin typing your search above and press return to search.

ఇటు బుజ్జగింపులు...అటు బెదిరింపులు

By:  Tupaki Desk   |   2 Oct 2018 6:52 AM GMT
ఇటు బుజ్జగింపులు...అటు బెదిరింపులు
X
తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత పోరు అంతకంతకూ పెరుగుతోంది. టిక్కెట్లు రాక ఇక్కట్లు స్రుష్టిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అసంత్రుప్తులను బుజ్జగించి దారికి తేవాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్టీ సీనియర్లకు ఆదేశించారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించటం లేదు. అసంత్రుప్తులకు అధికారంలోకి రాగానే వివిధ పదవులు ఇస్తామంటూ ఆశ చూపారు. అయిన వారిలో ఎలాంటి కదలిక రాలేదు. రెండు రోజుల క్రితం అసంత్రుప్తులపై పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కటువుగానే స్పందించారు. "మాట విన్నారా సరే..లేదూ వారి కర్మకి వాళ్లే బాధ్యలు" అని హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు కూడా అసంత్రుప్తుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పైగా పార్టీ అగ్రనేతలనే "ఎన్నికలలో చూసుకోండి"అంటూ హెచ్చరించారు. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మరింతా రాజుకుంది.

వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్ అభ్యర్ది మాజీ ఉపము‌ఖ్యమంత్రి రాజయ్యను మార్చాల్సిందేనంటూ సీనియర్ నేత కడియం శ్రీహరి మద్దతుదారులు పట్టుపడుతున్నారు. అభ్యర్దిని మార్చేది లేదంటూ మంత్రి కేటీఆర్ వారికి స్పష్టం చేసారు. అయిన వారిలో ఎలాంటి మార్పు రాలేదు. కడియం శ్రీహరి కూడా కేటీఆర్‌ తో చర్చించిన అసంత్రుప్తిగానే వెనుతిరిగారు. ఈ భేటి అనంతరం స్టేషన్ ఘనాపూర్ నాయకులు కొందరు రాజయ్యను ఓడించి తీరుతాం అంటూ ప్రతిజ్న చేసారు. ఇక నల్గొండ జిల్లా నాగార్జన సాగర్ అభ్యర్ది నోమూల నరసింహయ్యను మార్చాలని అక్కడ టిక్కెట్లు ఆశిస్తున్న కోటి రెడ్డి పట్టుబడుతున్నారు. ఎన్నికల సమయానికి ఆయన స్వతంత్ర అభ్యర్దిగా పోటి చేయలని అనుకుంటున్నారు. కోటి రెడ్డి కూడా గులాబి కండువా కప్పుకునే ప్రచారం చేయడం విశేషం. ఇక మేడ్చల్ నుంచి పోటి చేయాలని ఎంపీ మల్‌ రెడ్డి రంగారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. తన అనుచరులతో ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే - మరో నాయకుడు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఒక వేళ టిక్కెట్టు రాకపోతే వారు కూడా స్వతంత్ర అభ్యర్దులుగా పోటి చేసే అవకాశం ఉంది. టిఆర్ ఎస్ ఇంకా ప్రకటించని 14 నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటిస్తే ఈ అసమ్మతి సెగలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని - సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.