Begin typing your search above and press return to search.
మంత్రుల భేటీలో కేసీఆర్ వార్నింగ్.. అది కూడా లీకైందిగా?
By: Tupaki Desk | 13 Nov 2020 11:00 AM ISTవాస్తవాల్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతలా ప్రయత్నించినా.. సుదీర్ఘంగా సాగిన మంత్రుల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చేశాయి. సమావేశంలో ఏమేం మాట్లాడుకున్నామన్న విషయాలు ఏవీ బయటకు రాకూడదని.. బయటకు వస్తే ఒప్పుకునేది లేదని చెప్పినట్లు చెబుతున్నారు. సమావేశంలో చర్చించిన అంశాల్ని బయటకు వెల్లడిస్తే.. చర్యలు తప్పవన్న వార్నింగ్ కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.
అయినప్పటికీ మంత్రుల భేటీ వివరాలు బయటకు రావటం గమనార్హం. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని.. కరోనా కారణంగా ఇటీవల కాలంలో సరిగా కలవలేకపోయిన నేపథ్యంలో భోజనానికి పిలిచినట్లుగా మీడియాకు చెప్పాలంటూ సీఎం కేసీఆర్ చెప్పినా.. సమావేశంలో ఏమేం మాట్లాడారన్న విషయాలతో పాటు.. ఆసక్తికర అంశాలన్ని బయటకు రావటం గమనార్హం.
ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశ వివరాల్ని బయటకు వెల్లడించొద్దని కేసీఆర్ అంతలా చెప్పినా.. ఆయనేం మాట్లాడారన్న విషయాల్ని చెప్పటమే కాదు.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యల్ని యథాతధంగా మీడియా సేకరించటం గమనార్హం. సమావేశంలో బీజేపీ విష ప్రచారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో విష ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని.. వాటిని ఖండిస్తూ.. వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పినట్లు చెబుతున్నారు. ‘నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. బీజేపీ విష ప్రచారానికి ఎక్కడికక్కడ నిలువరించకపోతే నష్టం జరుగుతుంది. ఇలాంటి వాటి వల్ల మన ప్రజలకే నష్టం. సోషల్ మీడియా.. ఇతర ప్రసార మాధ్యమాల్ని భారీగా ఉపయోగించండి’ అని చెప్పిన మాటలు కూడా బయటకు వచ్చాయి. అయినా.. ఇవాల్టి పరిస్థితుల్లో రహస్యంగా ఉంచమని చెబితే మాత్రం.. సీక్రెట్ గా ఉండే అవకాశం లేదన్న విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు.