Begin typing your search above and press return to search.
దేశ రాజకీయాల్లోకి వెళతాః కేసీఆర్
By: Tupaki Desk | 3 March 2018 10:03 PM ISTసుదీర్ఘకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రధానంగా దేవ రాజకీయాల గురించి మాట్లాడిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో తన ఎంట్రీ ఉంటుందిని తెలిపారు. ఇదే సమయంలో...ఏపీకి ప్రత్యేక హోదా కోసం గళం విప్పడం గమనార్హం. టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం వివిధ అంశాలపై సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని నిలదీయాలని తమ ఎంపీలను కూడా కోరినట్లు తెలిపారు. ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటే ఇచ్చి తీరాలి. లేదా ఇవ్వనంటే ఇవ్వనని స్పష్టం చేయాలన్నారు. హోదా కోసం ఏపీలో ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. దేశమంతటికీ ఒకటే నీతి ఉండాలని - ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నీతి ఇదేం న్యాయమని సీఎం అన్నారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైందని.. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ - జీఎస్టీ - ఎన్డీఏకు మద్దతు - ఏపీకి ప్రత్యేక హోదా వంటి తదితర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ - బీజేపీ దొందూ దొందేనన్నారు. పథకాల పేరు మార్చడం మినహా కాంగ్రెస్ - బీజేపీ ఎవరొచ్చినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. భారత రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ప్రయాత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. పరిస్థితులు వచ్చినప్పుడు నాయకుడు పుడతాడు. మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే ఖచ్చితంగా వహిస్తానని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. థర్డ్ ఫ్రంట్ కావొచ్చు, మరో ఫ్రంట్ కావొచ్చు, కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ``స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని అంశాల అమలుపై చాలా సందర్భాల్లో అప్లికేషన్లు ఇచ్చినం. దరఖాస్తులు ఇచ్చినం. పార్లమెంటరీ పార్టీ సభ్యలు - రాష్ట్ర మంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. కాని ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదు. అందులో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయం ప్రధాని గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ రిజర్వేషన్లు కేంద్రం దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదు. శాసన సభలో తీర్మానం చేసినప్పుడు కూడా ఈ మాట బలంగా చెప్పి పంపించాం. ఉద్యోగాలు - విద్యా అవకాశాలు ఇచ్చే రిజర్వేషన్లను మా రాష్ర్టాల పరిధిలో ఇస్తున్నం కాబట్టి కేంద్రం నుంచి అడుగుతలేం కాబట్టి అది మీదగ్గర పెట్టుకోకండి అని చెప్పాం. దాని మీద స్పందన లేదు. లేకపోగా.. సేమ్ అదే పాత పద్ధతిని కొనసాగిస్తామని కేంద్రం చెబుతున్నది. ఈ విషయంపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తం. రిజర్వేషన్ల గురించి సుప్రీం కోర్టు చెప్పినట్లుగా రాజ్యాంగ సవరణ చేయొచ్చు. పెద్ద కష్టమేమి కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండే అది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆర్టికల్ 16ను సవరణ చేయొచ్చు. బిల్లు కూడా పాస్ అవుతుంది. కాకపోతే కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ల గుప్పిట్లో పవర్ పెట్టుకోవాలని కూర్చుంటున్నది`. అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.