Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫిక్స్ అయితే.. బొమ్మ ఈ రేంజ్ లోనే ఉంటాది

By:  Tupaki Desk   |   22 Jun 2021 4:07 AM GMT
కేసీఆర్ ఫిక్స్ అయితే.. బొమ్మ ఈ రేంజ్ లోనే ఉంటాది
X
గత ఏడాది అక్టోబరు 31న ఒక జిల్లా పర్యటనకు వెళ్లి.. తిరిగి హైదరాబాద్ కు వస్తున్న వేళ తన కాన్వాయ్ ను ఆపిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ ఊరి పేరు అడిగితే ‘వాసాల మర్రి’ అని పేరు చెప్పారు. ఎందుకో ఆయనకు ఆ ఊరు నచ్చింది. అంతే.. అక్కడి వారిని పిలిచి మాట్లాడటమే కాదు.. ఫాంహౌస్ కు పిలిపించుకు మాట్లాడారు. ఊరి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని తీరుస్తారని చెప్పారు.

కట్ చేస్తే.. క్యాలెండర్ లో నెలలు గడిచిపోయాయి. హటాత్తుగా తాను గతంలో వాసాలమర్రి గ్రామానికి ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చింది. అంతే.. ఆ ఊరి సర్పంచ్ ను లైన్లోకి తీసుకోవటం.. తాను జూన్ 22న ఊరికి వస్తున్నానని.. ఆ రోజున ఊరు మొత్తానికి.. తనతో వచ్చే వారికి.. తన కోసం భద్రత కల్పించే పోలీసు సిబ్బంది మొత్తానికి (సుమారు మూడు వేల వరకు) భోజనం తానే పెట్టిస్తానని.. తాను మాట్లాడటానికి వీలుగా ఒక భారీ ప్రాంగణం చూపించాలని కోరారు. సీఎం కేసీఆర్ అనుకున్నాక ఆ మాత్రం జరగకుండా ఉంటుందా?

మీటింగ్ కు ఒక జాగా.. భోజనాలు చేయటానికి మరో జాగా చూపిస్తే చాలు.. టీం వచ్చి అన్ని చూసుకుంటుందని సీఎం చెప్పారు. కేసీఆర్ చెప్పిన రోజు రానే వచ్చింది. మరి.. వాసాలమర్రి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? అన్నది చూస్తే.. అక్కడి పనుల భారీతనం.. ఎంత జోరుగా సాగుతున్నాయన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. వర్షాకాలం కావటంతో.. అనుకోని రీతిలో వర్షం వచ్చినా.. ప్రోగ్రాం పాడు కాకుండా ఉండేందుకు భారీ ఎత్తున వేదికను యుద్ధప్రాతిపదికన నిర్మించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం రూపురేఖలు మార్చాలన్న తలంపుతో ఉన్న దానికి తగ్గట్లే.. వాసాలమర్రి రూపురేఖల్ని మార్చేందకు అవసరమైన ప్రణాళిక నివేదికను సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న 670 పాత ఇళ్ల స్థానే డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించటం మొదలు 5వేల మీటర్ల మేర సీసీ రోడ్లు.. అండర్ గ్రౌండ్ డ్రౌనేజీ.. గ్రామ పంచాయితీ భవనం.. రెండు అంగన్ వాడీ భవనాలు.. సీడ్ ప్లాంట్.. వ్యవసాయ బోరు బావులు.. పంక్షన్ హాల్.. పీహెచ్ సీ సెంటర్.. ఇలా పలు అంశాల మీద గ్రామసభలో తీర్మానం చేయనున్నారు. మొత్తంగా కేసీఆర్ స్థాయిలో వాసాలమర్రిని మొత్తంగా మార్చాలన్నట్లుగా అక్కడి వాతావరణం ఉంది. కేసీఆరా మజాకానా?