Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు చంద్రబాబు ఆ క్రెడిట్ దక్కనివ్వడా?
By: Tupaki Desk | 22 Oct 2017 2:32 PM ISTచంద్రబాబునాయుడు పేరెత్తితే కేసీఆర్ మండిపడడంలో వింతేమీ లేదు. దీనికి ఒక సింపుల్ లాజిక్ కూడా ఉంది. ఇంత కష్టపడి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. అసలు హైదరాబాదు నగరంలో ఉన్న వైభవం మొత్తం నా పుణ్యమే అని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబునాయుడు నిత్యం చాలా సక్సెస్ సాధించేస్తుంటారు. ఏపీ విడిపోయి, ఆయన ప్రతిభ ఏదైనా ఉంటే.. అది అమరావతి విషయంలో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ.. ‘‘హైదరాబాదు అంటే నేనే కదా’’ అన్నట్లు చంద్రబాబునాయుడు చెప్పుకుంటూ ఉంటారు. మరి కేసీఆర్ ఉడుక్కోకుండా ఉండరు కదా.. పైగా భాగ్యనగరం మీద తన ముద్ర ఉండడం కోసం ఆయన అనేక కొత్త ఆలోచనలు చేసి.. కొత్త పదాలను కొత్త లక్ష్యాలను సృష్టిస్తే... ఆ క్రెడిట్ ను కూడా చంద్రబాబునాయుడే హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కేసీఆర్ తాను పరిపాలనలోకి వచ్చిన తర్వాత.. హైదరాబాదు నగరానికి ఓ కొత్త రూపు ఇవ్వాలనుకున్నారు. కొత్త పేరు - కీర్తి తీసుకురావాలనుకున్నారు. ఆ కీర్తి మీద తన ముద్ర ఉండాలని కోరుకున్నారు. ఆక్రమంలో భాగంగానే.. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతా అనే ప్రమాణాలు చేశారు. ఎటూ హైదరాబాదు హైటెక్ నగరం అనే కీర్తి ఉన్నప్పటికీ.. ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు ఎన్నడో తన ఖాతాలో రాసేసుకున్నారు. కాబట్టే కేసీఆర్ ‘విశ్వనగరం’ అంటూ కొత్త పదంతో కసరత్తు ప్రారంభించారు. కానీ తాజా వార్తలు చూస్తోంటే.. ఆ పదాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలోకి లాగేుసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో భాగంగా.. దుబాయిలో పారిశ్రామికవేత్తల సమావేశాల్లో గడుపుతున్న చంద్రబాబునాయుడు.. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత తనదేనని, అలాంటి తనకు మళ్లీ అమరావతిని నిర్మించే అదృష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇక్కడేమో నగర జీవులు.. చినుకు రాలితే చాలు.. నరకం చూపించే రోడ్లతో సతమతం అవుతోంటే.. దీన్ని విశ్వనగరం చేసేస్తాం అని కేసీఆర్ అండ్ కో డాంబికంగా పలుకుతోంటే.. అటువైపు చంద్రబాబు మాత్రం తానెప్పుడో దీనిని విశ్వ నగరం చేసేశా అని చెప్పుకుంటున్నారు. అచ్చంగా క్రెడిట్ మొత్తం తనకే దక్కాలనుకుంటే గనుక.. కేసీఆర్ హైదరాబాదు నగరానికి సంబంధించి మరో కొత్త పదాన్ని వెతుక్కోవాల్సి వస్తుందేమో. అయినా.. ఎప్పుడో ఏదో చేశా.. అని ఎంతకాలం చెప్పుకుంటారు చంద్రబాబుగారూ.. గత మూడున్నరేళ్లుగా అమరావతి విషయంలో తమరేం చేశారో చెప్పండి అని ప్రజలు ప్రశ్నిస్తే ఆయన వద్ద జవాబుంటుందా? లేదా - డిజైన్లు - త్రీడీలో చూపించి కొత్త ప్రసంగం ప్రారంభిస్తారా?