Begin typing your search above and press return to search.
జాతీయ పార్టీ దిశగా కీలక జర్నీకి ఓకే చెప్పిన కేసీఆర్
By: Tupaki Desk | 20 Sep 2022 4:31 AM GMTజాతీయపార్టీని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన గ్రౌండ్ వర్కును పెద్ద ఎత్తున చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు.. కూటమి కట్టేందుకు ప్రయత్నాలు చేయటం.. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీ అధినేతలతో భేటీ కావటం.. పలు రాష్ట్రాలకు వెళ్లి రావటం లాంటివి చేయటం తెలిసిందే.
జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాల్ని ముమ్మరం చేసిన కేసీఆర్.. మరో ఐదు రోజుల్లో కీలక ప్రయాణాన్ని పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25న ఆయన హరియాణా రాష్ట్రానికి వెళ్లనున్నారు. సీనియర్ రాజకీయ నేత.. స్వాతంత్య్ర సమరయోధుడు.. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ 108వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు.
హరియాణాలో నిర్వహిస్తున్న సమ్మాన్ దివస్ కు కేసీఆర్ ను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ లు కూడా హాజరవుతారని చెబుతున్నారు.
కేసీఆర్ కు ఆహ్వానాన్ని దేవీలాల్ కుమారుడు హరియాణా మాజీ ముఖ్యమంత్రి.. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా ప్రత్యేకంగా పంపినట్లుగా చెబుతున్నారు.
ఫతేబాద్ లో నిర్వహించేఈ కార్యక్రమంలో విపక్షాల ఐక్యతను చాటేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కాకుండా మిగిలిన విపక్షనేతల్ని ఈ ప్రోగ్రాంకు పిలుస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ.. కాంగ్రెసేతర పార్టీలతోసత్ సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు.
తాజా జర్నీ రాజకీయంగా కీలకంగా మారుతుందని చెబుతున్నారు. ఈ జర్నీలో పలువురు పార్టీ అధినేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతారన్నది విశ్వసనీయ సమాచారం. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.