Begin typing your search above and press return to search.

ప్రతీ సంక్రాంతి కి అల్లుల్లు.. ఈసారి కేసీఆర్

By:  Tupaki Desk   |   9 Jan 2020 5:20 AM GMT
ప్రతీ సంక్రాంతి కి అల్లుల్లు.. ఈసారి కేసీఆర్
X
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ట్రైలర్ లో బాగా బాగా పాపులర్ అయిన డైలాగ్ ‘ప్రతీ సంక్రాంతికి అల్లుల్లొస్తారు.. ఈసారి మొగుడొస్తున్నాడు’ అని ప్రకాష్ రాజ్ వీరావేశంతో పలుకుతాడు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వాసులు కూడా ఇదే డైలాగ్ వల్లెవేస్తున్నారు. ఎందుకంటే ఈసారి అల్లుల్లతోపాటు సీఎం కేసీఆర్ కూడా ఎర్రవల్లికి వస్తున్నారు.. అవును.. కేసీఆర్ ఈ పండుగను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే జరుపుకోబోతున్నారు.

కేసీఆర్ పదేళ్ల కిందట ఎర్రవల్లి లో భారీగా భూములు కొని వ్యవసాయ క్షేత్రంగా మార్చారు. అక్కడే వ్యవసాయం చేస్తున్నారు. జీ+2తో ఇంటిని కట్టుకున్నారు. అయితే సీఎం అయ్యాక నాయకుల తాకిడీ సెక్యూరిటీ ఎక్కువై పోవడంతో అది సరిపోవడం లేదు. పైగా అందులో లిఫ్ట్ లేదు. దీంతో కేసీఆర్ మరికొంత భూమిని కొనుగోలు చేసి ఫాంహౌస్ నైరుతి మూల కొత్త ఇంటిని అధునాత వసతులతో నిర్మించుకుంటున్నారు. ఆ నిర్మాణ పనులు జాప్యంతో గురు మూఢమి కారణంగా డిసెంబర్ 13 తర్వాత ముహూర్తాలు లేవని గృహ ప్రవేశం ముందే చేశారు.ఇప్పుడు సంక్రాంతికి ఆ భవనం పూర్తి కావాలని వాయువేగంతో పూర్తి చేయాలని ఆదేశించారట.. ఈ సంక్రాంతిని కొత్త ఇంటిలో జరుపుకోవడానికి కేసీఆర్ రెడీ అయ్యారట..

అందుకే ఈ అత్యాధునిక భవన కాంట్రాక్టును పొందిన ఏకంగా 200మందికి పైగా కార్మికులను తీసుకొచ్చి పగలూ రేయి పనులు చేయిస్తూ 11వ తేదీకి పూర్తి చేయడానికి సమాయత్తమవుతోంది.

ఇలా కేసీఆర్ ఈ సంక్రాంతికి ఎర్రవల్లికి వస్తుండడంతో స్థానిక గ్రామాల్లో సందడి నెలకొంది.