Begin typing your search above and press return to search.

బీజేపీ దెబ్బ కి కేసీఆర్ కూడా అబ్బా అనాల్సిందే..?

By:  Tupaki Desk   |   26 Nov 2019 6:14 AM GMT
బీజేపీ దెబ్బ కి కేసీఆర్  కూడా అబ్బా అనాల్సిందే..?
X
ప్రస్తుతం కేంద్రం లో ప్రధాని మోడీ తనకి ఎదురు లేకుండా ఎలా అందరిని బీజేపీలోకి చేర్చుకుంటూ పోతున్నారో ..అలాగే సీఎం కేసీఆర్ కూడా తెలంగాణా లో తనకి ఎదురే లేకుండా, ప్రతిపక్షం అనేది కనిపించకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పక్కా వ్యూహంతో ముందస్తు ఎన్నికలకి వెళ్లి ..భారీ విజయం సాధించారు. దీనితో తెలంగాణాలో కేసీఆర్ నాయకత్వం లోని తెరాస తిరుగులేని ఆధిపత్యం తో దూసుకు పోతుంది.

మరోవైపు .. రాష్ట్రంలో 119 సీట్లు ఉంటే దాదాపుగా అన్ని చోట్లా పోటీకి దిగిన బీజేపీ కి 103 స్థానాలలో డిపాజిట్స్ కూడా దక్కలేదు. కానీ , ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండటంతో .. వచ్చే ఎన్నికల నాటికీ బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటుంది. కానీ , ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులని చూస్తే తెలంగాణ లో టి ఆర్ ఎస్ ని కొట్టాలి అంటే సాధారణ విషయం కాదు. అందుకే బీజేపీ ఒక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసింది. యుద్ధంలో నాయకుడిని ఓడిస్తే ..సేన విచ్ఛిన్నం అయ్యి ..రాజ్యం దక్కుతుంది. ఈ విధంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సీఎం కేసీఆర్ సీటు పై కన్నేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి ప్రతి నిధ్యం వహిస్తున్నాడు. ఒకప్పుడు అది కాంగ్రెస్ కి కంచుకోట ..కానీ , ఇప్పుడు అది గులాబీ కోటగా మారిపోయింది. వరుసగా రెండు సార్లు గజ్వేల్ నుండి గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం తో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులని పరుగులు పెట్టిస్తున్నారు. ఇటువంటి సమయంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ గజ్వేల్ లో పాగా వేయాలి అంటే ఇప్పటినుండే సన్నద్ధం అవ్వాలి అని అనుకుంటుంది. ఇక మొన్న జరిగిన ఎన్నికలలో కేసీఆర్ పై కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి ఎన్నికల ఫలితాల తరువాత కారెక్కేసారు. ఇక బీజేపీ నుండి పోటీ చేసిన మహిళా నేత ఆకుల విజయ కు కనీసం చెప్పుకునే స్థాయి లో కూడా ఓట్లు రాలేదు.

ఇకపోతే ప్రస్తుతం గజ్వేల్ లో కాంగ్రెస్‌ బాధ్యతలను నర్సా రెడ్డి చూస్తున్నారు. ఈయన కూడా ఒకప్పటి టి ఆర్ ఎస్ నేతనే. కాంగ్రెస్ నుండి కారు గూటికి చేరిన నర్సా రెడ్డి . ఆ తరువాత తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అని , తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేసారు. స్థానికంగా ఈయనకి కొంచెం పట్టుంది. దీనితో నర్సారెడ్డికి బీజేపీ వల వేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ లో ఎలాగైనా పట్టు సాధించాలని అనుకుంటున్నా బీజేపీ ..ఎలాగైనా వచ్చే ఎన్నికలలో గజ్వేల్ లో బీజేపీ జెండా ఎగుర వేయాలని చూస్తుంది. దీనికోసమే గజ్వేల్ లో బలమైన నేతగా గుర్తింపు ఉన్న నర్సారెడ్డి కి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట .. తెలంగాణ బీజేపీ కి డిసెంబర్ లో కొత్త అధినేత రాబోతున్నాడు ..అయన వచ్చిన తరువాత నర్సారెడ్డి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏమైనా కూడా బీజేపీ ఒకేసారి కోడని ఢీ కొట్టాలని చూస్తుంది. ఏదైనా తేడా జరిగితే .. మొత్తం పడవే మునిగి పోవడం ఖాయం.