Begin typing your search above and press return to search.

కేసీఆర్ : థర్డ్ ఫ్రంట్ నుంచి జాతీయ పార్టీ వరకు

By:  Tupaki Desk   |   11 Jun 2022 6:29 AM GMT
కేసీఆర్ : థర్డ్ ఫ్రంట్ నుంచి జాతీయ పార్టీ వరకు
X
తొందరలోనే జాతీయ పార్టీ పెట్టడానికి కేసీయార్ రెడీ అయిపోతున్నారు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీగా భారత్ రాష్ట్రీయ సమితి)గా మార్చబోతున్నట్లు సమాచారం. ఈనెలాఖరులో ఢిల్లీలో ఇదే విషయాన్ని ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేసీయార్ మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో శుక్రవారం సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు.

జాతీయ పార్టీగా మారిన తర్వాత కూడా తమ పార్టీ సింబల్ గా కారు గుర్తునే కేసీయార్ కోరుకోబోతున్నారు. తొందరలోనే జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్ధిని ఓడించటమే ఏకైక టార్గెట్ గా కేసీయార్ పావులు కదుపుతున్నారు. తొందరలోనే జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికనే జాతీయస్ధాయిలో తన పార్టీ ప్రకటనకు వేదికగా చేసుకోవాలని కేసీయార్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు.

రాష్ట్రపతి ఎన్నికలో రెండంచెల విధానాన్ని అవలంభించబోతున్నట్లు సమాచారం. మొదటిదేమో నాన్ ఎన్డీయే, నాన్ యూపీయే పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావటం. రెండోదేమో అవసరమైతే యూపీఏ పార్టీలతో సయోధ్య కుదుర్చుకుని నాన్ ఎన్డీయే పార్టీలను బయటకు లాగేయటం.

కొంతకాలంగా నరేంద్రమోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేసీయార్ మండిపోతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా మోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే టార్గెట్ గా చాలా ప్రయత్నాలే చేశారు.

కేసీయార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటీ కలిసిరాలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కేసీయార్ కు సరైన క్రెడిబులిటి లేకపోవటమే. జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కు ఏమాత్రం విశ్వసనీయత లేదు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, నవీన్ పట్నాయక్, ఉద్ధవ్ థాక్రే, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, శరద్ పవార్ ఇలా ఎవరిని కలిసినా పెద్దగా ఉపయోగం కనబడటం లేదు.

ఎందుకంటే కేసీయార్ ప్రతిపాదనలకు ఎవరు కూడా సానుకూలంగా కనబడటం లేదు. నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీల ఐక్యవేదికని కేసీయార్ చెబుతున్నది వర్కవుట్ కాదని అందరికీ తెలుసు. దాంతో అందరు కేసీయార్ ను దూరంపెట్టేశారు. దాంతో విషయం బోధపడి చివరకు నాన్ యూపీఏ విషయంలో మెత్తపడ్డారు. మరిపుడు జాతీయ పార్టీ అంటున్నారు ఏమవుతుందో చూడాలి.