Begin typing your search above and press return to search.
కరోనా తెలంగాణ బొక్కసాన్ని అంతలా దెబ్బేసిందా?
By: Tupaki Desk | 8 Nov 2020 2:20 PM ISTప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా లాభ పడినోళ్లు వేళ్లమీద లెక్కేయొచ్చు. అందుకు భిన్నంగా నష్టపోయిన వారికి లెక్కే లేదు. సగటుజీవి మొదలు సర్కారు వరకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదంటున్నారు. ఇదే విషయాన్ని లాక్ డౌన్ వేళలో సీఎం కేసీఆర్ తరచూ చెప్పేవారు. తాజాగా ఆయన రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా తెలంగాణ ఆదాయానికి ఎంత దెబ్బ తగిలిందన్న విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు.
రూ.1.82లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ రూపొందిస్తే.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1.38లక్షల కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.22.06వేల కోట్లు. కరోనా పుణ్యమా అని.. ప్రభుత్వ అంచనాలన్ని తారుమారు కావటమే కాదు.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో.. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయం దాదాపు రూ.52.7వేల కోట్లు మేర తగ్గుతుందని చెబుతున్నారు.
ఆదాయ వృద్ధిరేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలురూపొందిస్తే.. తాజాగా వృద్ధి తర్వాత.. అసలుకే ఎసరు అయిన పరిస్థితి. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు సాగిన ఏడు నెలల్లో పన్నులు.. పన్నేతర మార్గాల్లో రాష్ట్రానికి 2019లో రూ.39.6వేల కోట్లు వస్తే..ఈసారి రూ.33.7 వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది ముగిసే నాటికి రూ.1.15లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.68.7వేల కోట్లకు మించి వచ్చే అవకాశం లేని పరిస్థితి. దీంతో.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.47.1వేల కోట్ల మేర తగ్గే పరిస్థితి. ఖర్చు తగ్గక.. ఆదాయం తగ్గిపోయిన పరిస్థితుల్లో వచ్చే ఏడాది బడ్జెట్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో.. బడ్జెట్ అంచనాల్లో మార్పులు రావటమే కాదు.. కోతలు కూడా ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు.