Begin typing your search above and press return to search.
కేసీఆర్ కలల జెండా సిరిగి..స్తంభమే మిగిలింది
By: Tupaki Desk | 17 Jun 2016 10:23 AM ISTభారీ కలల్ని కనటం ఒక ఎత్తు. వాటిని అనుకున్న సమయానికి పూర్తి చేయటం మరో ఎత్తు. అయితే.. ఈ రెండింటితోనే కల పూర్తి కాదన్న సత్యం ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. కలలు కని.. దాని సాకారంలో సక్సెస్ అయినా.. దాన్ని కొనసాగించటం ఎంత కష్టమో అన్న వాస్తవం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. నిజానికి ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని తప్పు పట్టే కన్నా.. ఆయన నమ్ముకున్న అధికారుల్ని.. ఆయన కల సాకారం అవుతుందని చెప్పిన వారిని తప్పు పట్టాల్సిందే.
ఎందుకంటే.. ఎంతో ఆడంబరంగా దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలన్న కేసీఆర్ తన ఆలోచనను వ్యక్తపర్చినప్పుడు.. అదెంతవరకూ సాధ్యమవుతుంది? అన్నవిషయం మ ద అన్ని కోణాల్లో ఆలోచించి చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ముఖ్యమంత్రి వారి నోటి నుంచి వచ్చింది కాబట్టి.. సాధ్యాసాధ్యాల మీద సరైన కసరత్తు చేయకుండా.. ఓకే చెప్పేసి.. ఆర్భాటంగా ప్రచారం చేసుకొని.. కలల జెండాను ఎగరవేసిన తర్వాత ఎదురుదెబ్బలు తగలం చూసినప్పుడు ప్లానింగ్ లోపం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
291 మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఎగురువేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు.. అంత ఎత్తులో బలంగా వీచే గాలులకు తట్టుకొని నిలిచేలా వస్త్రాన్ని (అది ప్లాస్టిక్ అయినా ఇంకే మెటీరియల్ అయినా) ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. కానీ.. వారి అంచనాలు ఫెయిల్ అయి.. తాజాగా జెండా లేక.. వట్టి స్తంభం మాత్రమే మిగిలిన దుస్థితి. ఈ భారీ జెండాను ఎగురవసే క్రమంలో ఏదైనా తేడా వచ్చి జెండా చిరిగిపోతే ప్రత్యామ్నయంగా మరో మూడు జెండాల్ని అధికారులు సిద్ధం చేసుకున్నారు.
కానీ.. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జూన్ 2న ఆవిష్కరించిన జెండా.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మూడు జెండాలు చిరిగిపోయిన పరిస్థితి. దీంతో.. నాలుగో జెండాను ఎగురవేసే సాహసాన్ని అధికారులు చేయటం లేదు. అదే చేస్తే.. రేపొద్దున ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి జెండా దొరకటం అంత తేలికైన విషయం కాదు. ప్రత్యేకమైన ప్లాస్టిక్ తో రూపొందించిన జెండా బలమైన గాలులు వీచినా తట్టుకొని నిలబడుతుందన్న అంచనాలు వ్యక్తమైనా.. ప్రాక్టికల్ గా అది వర్క్ వుట్ కాని పరిస్థితి.
దీంతో.. గాలుల వేగం తగ్గే వరకూ జెండా ఎగురవేయకూడదని అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఒక్క జెండానే మిగిలింది. మరికొన్ని జెండాలను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. అవి వచ్చేసరికి మరికొంత కాలం పట్టనుంది. దీంతో.. ఉన్న ఒక్క జెండానే అట్లానే అట్టిపెట్టి.. ప్రస్తుతానికి జెండాస్తంభాన్ని అలా వదిలేశారు. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ భారీ జెండా ఖరీదు కూడా ఎక్కువగానే ఉంది. ఒక్కోజెండాకు రూ.1.15లక్షలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో తరచూ జెండా చిరిగిపోతే దీని నిర్వహణ వ్యవహారం తడిచిమోపెడు అవుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. జెండా ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిన ప్రాధమిక స్థాయిలోనే దీని వల్ల ఎదురయ్యే పరిణామాల్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తే.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేది కాదన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బలమైన గాలులు వీచటం తగ్గే వరకూ జెండా ఎగురవేయకూడదన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి జెండా లేని స్తంభం మాత్రమే కొంతకాలం కనిపిస్తుందన్న మాట.