Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంట విషాదం.. సోద‌రి క‌న్నుమూత‌

By:  Tupaki Desk   |   6 Aug 2018 7:16 AM GMT
కేసీఆర్ ఇంట విషాదం.. సోద‌రి క‌న్నుమూత‌
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంట విషాదం నెల‌కొని ఉంది. కేసీఆర్ సోద‌రి లీల‌మ్మ ఈ రోజు క‌న్నుమూశారు. గ‌డిచిన కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆమె.. హైద‌రాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఫిబ్ర‌వ‌రిలోనే కేసీఆర్ మ‌రో సోద‌రి విమ‌లా భాయ్ క‌న్నుమూసిన వైనం తెలిసిందే. కేసీఆర్ కు ఎనిమిది మంది అక్క‌లు.. ఒక చెల్లి.. ఒక అన్న ఉన్నారు. విమ‌లా భాయ్ విషాదం చోటు చేసుకొని నాలుగైదు నెల‌లు కాక‌ముందే మ‌రో సోద‌రి మ‌ర‌ణ‌వార్త ఆయ‌న్ను విషాదంలోకి నెట్టింద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్‌.. త‌న సోద‌రి మ‌ర‌ణ‌వార్త విన్నంత‌నే ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు. వ‌రుస విషాదాలతో కేసీఆర్ క‌ల‌త చెందుతున్న‌ట్లుగా తెలుస్తోంది.