Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంచలనం.. కీలక నిర్ణయాన్ని తీసుకున్న వైనం

By:  Tupaki Desk   |   1 Jan 2021 11:28 AM IST
కేసీఆర్ సంచలనం.. కీలక నిర్ణయాన్ని తీసుకున్న వైనం
X
కొద్ది రోజులుగా వరుస పెట్టి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జిల్లాకలెక్టర్లకు కీలకబాధ్యత అప్పజెప్పటం ద్వారా పలు వివాదాలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. వ్యవసాయ.. భూవివాదాలు.. ఇతర వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కొత్త బాధ్యతల్ని వారికి అప్పజెప్పారు. భూములకు సంబంధించిన అంశాల్ని ఇకపై వారే పర్యవేక్షించాలని పేర్కొంటూ కొత్త ఆదేశాల్ని జారీ చేశారు.

వ్యవసాయ భూముల విషయంలో వచ్చే అంశాల్ని జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరించేలా పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తో మరిన్ని ఆప్షన్లను పెట్టటం.. మరింతగా మెరుగుపర్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతకాలం భూముల వివాదాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులకు అవకాశం ఉండేది. ఎమ్మార్వో స్థాయి అధికారులకు పలు అధికారాలు ఉండేవి. అయితే.. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతుందన్న ఉదంతాలు తెర మీదకు రావటంతో బాధ్యత కలిగిన అధికారుల చేతుల్లో పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతోనేకలెక్టర్లకు కొత్త బాధ్యతల్ని అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఇప్పటికే పని ఒత్తిడితో ఉండే కలెక్టర్లు.. భూ వివాదాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒత్తిళ్లను తలొగ్గకుండా ఉండటం వరకు ఓకే అయినా.. వివాదాల విషయంలో నిర్ణయం తీసుకోవటంలో ఆచితూచి పేరుతో పెద్ద ఎత్తున ఆలస్యం జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. కలెక్టర్లకు కొత్త బాధ్యతలు అప్పజెప్పటం బాగానే ఉందా? అదెంత వరకు వర్కువుట్ అవుతుందన్నది మాత్రం ప్రశ్న వినిపిస్తోంది.