Begin typing your search above and press return to search.

ప్రజలకు కేసీఆర్ మరో వరం

By:  Tupaki Desk   |   24 Sept 2020 10:30 AM IST
ప్రజలకు కేసీఆర్ మరో వరం
X
రైతులు, రైతాంగం.. వ్యవసాయం విషయంలో వివాదాలకు తావులేకుండా తెలంగాణలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనది రైతు ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు. మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.

వ్యవసాయేతర ఆస్తుల విషయంలో సీఎం కేసీఆర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవయసాయేతరుల ఆస్తులు కలిగి ఉన్న ప్రజలకు మెరూన్ రంగు పాస్ బుక్ ఇవ్వనున్నారు.

దేశంలో వ్యవసాయేతర ఆస్తులకు ఈ తరహా పాస్ బుక్ లు ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణనే అని కేసీఆర్ తెలిపారు. పేద, మద్యతరగతి వర్గాల ప్రజల ఆస్తులకు పూర్తిగా రక్షణ కల్పించాల్సిన విప్లవాత్మక రెవెన్యూ చట్టాన్ని తెచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే ఈ పట్టాల వల్ల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ పై సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు ప్రజలకు వరాలు కురిపించారు.

రాష్ట్ర ప్రజలు ఇళ్లు, ప్లాట్లు, ఫామ్ హౌజ్ లను ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఆన్ లైన్ లో మ్యూటేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ పాస్ పుస్తకాల జారీ ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని కేసీఆర్ వెల్లడించారు. ఆస్తులకు హక్కులు కల్పించబడడంతోపాటు ప్రజలను భూవివాదాలు, ఘర్షణల నుంచి రక్షించవచ్చని తెలిపారు.

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పేదల ఇళ్ల స్థలాలకు రక్షణ కల్పిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. దీంతో వారు భవిష్యత్ లో బ్యాంకు రుణాలు పొందగలరని పేర్కొన్నారు.